అర్థవంతమైన పాత్రలే చేస్తా

అర్థవంతమైన పాత్రలే చేస్తా

  సమంత ఇప్పటి వరకూ అల్లరి చిల్లరి పాత్రలు, గ్లామర్‌ క్యారెక్టర్‌లు పోషించింది. కానీ ఇక నుంచి తను చేసే పాత్రలు చాలా అర్థవంతంగా ఉంటాయని, అలా ఉంటేనే ఆ సినిమా చేసేందుకు అంగీకరిస్తానని తేల్చిచెప్పేసింది. రంగస్థలం, మహానటి, ఇరుంబు తిరై, యూటర్న్‌ చేశాక ఆమె పూర్తిగా తన అభిప్రాయాన్ని మార్చేసుకుంది. ఇక నుంచి నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు అయితేనే చేసేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పుడు తన గొంతును కూడా వినిపించనుంది. ఇప్పటి వరకూ తన గొంతుకు కోసం అరువు తెచ్చుకున్నా... ఇక నుంచి తెలుగులో డబ్బింగ్‌ స్వయంగా చెప్పుకోనుంది. ఇప్పటి మహానటి, యూటర్న్‌ చిత్రాల్లో ఆమె తన గొంతునే వినిపించింది. తన భర్త నాగచైతన్య చిత్రం 'శైలజా రెడ్డి అల్లుడు', సమంత సినిమా 'యూటర్న్‌' ఒకే రోజు విడుదల కాబోతున్నాయి. ఈ సందర్భంగా తన చిత్రమే కాదు నాగచైతన్య సినిమా కూడా విజయం సాధించాల్సి ఉంది.