బరువు పెరగ్గలను...తగ్గగలను

బరువు పెరగ్గలను...తగ్గగలను

 ఎవరైనా బరువు పెరిగిపోతుంటే తెగ ఆందోళన చెందుతుంటారు. కరీనా కపూర్‌ ఖాన్‌ మాత్రం సినిమాలో పాత్రకు ఎంత బరువు కావాలో అంత బరువు పెరగ్గలను, తగ్గాలని అంటే తగ్గ గలను అని కూడా అని చెబుతోంది. ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు 90 కిలోలు ఉండేవారు. తైమూర్‌కు జన్మనిచ్చిన తర్వాత క్రమేణ బరువు తగ్గతూ ప్రస్తుతానికి 60 కిలోలకు వచ్చేశారు. ఈ సందర్భంగా తాను ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటానని, అందుకోసం రోజుకు ఆరేడు గంటలు కేటాయిస్తానని చెప్పారు కరీనా. శ్రమిస్తే బరువు తగ్గడం, పెరగడం పెద్ద సమస్య కాదని తన విషయంలో అలాగే జరుగుతుందని కూడా అన్నారు. త్వరలో నేను చేయబోయే సినిమా కథలో తక్కువ బరువు ఉండేలా పాత్ర డిమాండ్‌ చేయడంతో బరువు తగ్గాల్సి వచ్చిందని, ఒకే వేళ అదే కథ బరువు ఎక్కువగా ఉండాలి అని కోరి ఉంటే అలా పెరిగేదాన్ని అని చెప్పారు.