భన్సాలీ చిత్రంలో నాయిక ఎవరు?

భన్సాలీ చిత్రంలో నాయిక ఎవరు?

  బాలీవుడ్‌లో ఇప్పుడు ఏవైనా ముఖ్యమైన పాత్రలు చేయాల్సి వస్తే ఇద్దరే ఇద్దరి మధ్య పోటీ నెలకొంటుంది. వాళ్లే దీపికా పదుకొనే, ఆలియా భట్‌. గతంలో ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే మధ్య తీవ్ర పోటీ ఉండేది. ప్రియాంకకు వివాహం జరిగిన తర్వాత ఆ రేసులోకి ఆలియా భట్‌ వచ్చింది. సంజరు లీలా భన్సాలీ 'పద్మావత్‌' తర్వాత కొత్త చిత్రం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఇప్పటి వరకూ ఆయన దర్శకత్వంలో వచ్చిన రామ్‌ లీలా, బాజీరావు మస్తాని, పద్మావత్‌లో దీపికానే లీడ్‌ రోల్‌ చేస్తూ వచ్చింది.

ఇప్పుడు ఈమెకు బదులు ఆలియా భట్‌ను ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నట్టు బాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. కానీ ఎవరిని ఎంపిక చేశారన్న దానిపై మాత్రం భన్సాలీ స్పష్టతనివ్వలేదు. ఇంకా ఇప్పటి వరకూ ఎవరినీ ఎంపిక చేయలేదు కానీ ఆలియాను ఎంపిక చేయాలని భన్సాలీ ఆసక్తి చూపుతున్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. దీపికా మాత్రం ఎప్పటికీ భన్సాలీ ఫేవరెట్‌ నటే. రణవీర్‌ సింగ్‌, దీపికా పదుకొనేలతో చేసిన మూడు భారీ విజయాలు తర్వాత కొత్తవారితో చేయాలని ఆలోచిస్తున్నట్టు పేర్కొంటున్నారు. చివరకు ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి.