>

బిగ్‌బాస్-11 సీజన్ విజేత శిల్పా..

బిగ్‌బాస్-11 సీజన్ విజేత శిల్పా..

 ముంబై: బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టీవీ రియాలిటీ షో బిగ్‌బాస్-11. ఉత్కంఠగా సాగిన బిగ్‌బాస్-11 సీజన్ విజేతగా ప్రముఖ టీవీ నటి శిల్పా షిండే నిలిచింది. విన్నర్‌గా నిలిచిన శిల్పా షిండేకు సల్మాన్‌ఖాన్ బిగ్‌బాస్ ట్రోఫీతోపాటు రూ.44 లక్షల ప్రైజ్‌మనీ గిఫ్ట్‌గా అందజేశాడు. ఇక బిగ్‌బాస్-11 సీజన్ లో మరో టీవీ నటి హీనాఖాన్ రన్నరప్‌గా నిలిచింది. ప్యాడ్‌మాన్ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఆదివారం జరిగిన బిగ్‌బాస్-11 ఫినాలే ఈవెంట్‌లో బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ చీఫ్‌గెస్ట్‌గా హాజరయ్యాడు. శిల్పా షిండే హిందీలో ప్రసారమైన బాభీ సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమ్రపాలి, సంజీవని సినిమాల్లో కూడా నటించింది.