బాలీవుడ్ పై క్రేజీగా ఉన్న రకుల్ 

బాలీవుడ్ పై క్రేజీగా ఉన్న రకుల్ 

  సౌత్ ప‌రిశ్ర‌మ‌కి చెందిన చాలామంది టాలీవుడ్ హీరోయిన్స్ హిందీ సినిమాలపై మోజుతో అక్కడికి వెళ్లారు. అక్కడ స్టాండ్ కాలేక బ్యాక్ టు పెవిలియన్ బాట పట్టారు. టాలీవుడ్ లో వరస ఆఫర్లు ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఇప్పుడు అదే ధ్యాసలో ఉంది. తెలుగులో ఇలియానా .. తమన్నా .. కాజల్ కథానాయికలుగా ఒక రేంజ్ లో తమ హవాను కొనసాగించారు. తెలుగులో వరుస అవకాశాలతో దూసుకుపోతూనే బాలీవుడ్ లో చోటు సంపాదించుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేశారు. కానీ ఆ ముగ్గురికీ కూడా ఆశించిన ఫలితాలు దక్కలేదు. ఇలియానా తెలుగు తెరకి పూర్తిగా దూరం కాగా, తమన్నా .. కాజల్ కొన్ని మంచి అవకాశాలను కోల్పోవలసి వచ్చింది.

ఇప్పుడు రకుల్ కూడా హిందీ సినిమాలపై దృష్టి పెట్టింది. నీరజ్ పాండే డైరెక్షన్ లో సిద్ధార్థ్ మల్హోత్రాకు జోడీగా 'ఐయారి' సినిమా చేస్తోంది. ఏదో ఆశకొద్దీ బాలీవుడ్ కు వెళ్లినా కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోకపోతే రకుల్ కూడా వారిలాగే అక్కడ ఫ్లాప్ కావలసి వస్తుందని కొందరు ముందు జాగ్రత్తలు చెబుతున్నారు. ర‌కుల్ చేతిలో ప్ర‌స్తుతం ప‌లు ప్రాజెక్టులు ఉన్నాయి. స్పైడ‌ర్ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తున్న జ‌య‌జానకి నాయ‌క‌, థీర‌మ్ అథికార‌న్ ఒండ్రు, షిమ్లా మిర్చి సినిమాల‌తో బిజీగా ఉంది.