బోని కపూర్‌కు ఎవరంటే ఎ‍క్కువ ఇష్టం

బోని కపూర్‌కు ఎవరంటే ఎ‍క్కువ ఇష్టం

  ఇన్‌స్టాగ్రామ్‌లో తీసుకొచ్చిన ‘ఆస్క్‌ మి ఎనీథింగ్‌’ ఫీచర్‌, సెలబ్రిటీల నుంచి ఆసక్తికరమైన విషయాలను వెలుగులోకి తీసుకొస్తోంది. తమ తమ జీవిత విశేషాలు, కెరీర్‌, ఇష్టఅయిష్టాలను సెలబ్రిటీలు ఈ ఫీచర్‌ ద్వారా తమ అభిమానులతో పంచుకుంటున్నారు. ఇటీవల బోని కపూర్‌ మొదటి భార్య కూతురు అన్హులా కపూర్‌ కూడా ఈ ఫీచర్‌ను వాడారు. ఈ ఫీచర్‌ ద్వారా అన్హులా కపూర్‌ నుంచి పలు ఆసక్తికర విషయాలను అభిమానులు రాబట్టారు. ‘మీ నలుగురు తోబుట్టువుల్లో, బోని కపూర్‌ ఎక్కువగా ఇష్టపడేది ఎవరూ?’ అని అభిమానులు అడిగారు. ఈ ప్రశ్నకు సమాధానం అందరూ అర్జున్‌ కపూర్‌ లేదా జాన్వీ కపూర్‌ వస్తుందని భావించారు. కానీ వారిద్దరూ కాదంట. అందరి కంటే చిన్న చెల్లి, ఖుషీ కపూర్‌ అంటే బోని కపూర్‌కు ఎక్కువగా ఇష్టమని అన్హులా రివీల్‌ చేశారు. 

బోని కపూర్‌ మొదటి భార్య మోనా కపూర్‌ సంతానం అర్జున్‌, అన్హులాలు కాగ, జాన్వీ, ఖుషీలు అందాల తార, రెండో భార్య శ్రీదేవి సంతానం. ఈ ఏడాది ఫిబ్రవరిలో శ్రీదేవీ చనిపోయిన తర్వాత వీరి బంధం బాగా బలపడింది. చెల్లెళ్లు జాన్వీ, ఖుషీలకు అర్జున్‌, అన్హులాలు ఎల్లవేళలా తోడుంటూ వస్తున్నారు. అన్న అర్జున్‌ కపూర్‌, చెల్లెళ్లపై ఈగ కూడా వాలనీయనంత కేరింగ్‌గా చూసుకుంటూ వస్తున్నారు. 

చాలా మంది బోని కపూర్‌కు తన ఒకానొక కొడుకంటే ఎక్కువగా ఇష్టమని, లేదా జాన్వీని ఎక్కువగా ముద్దు చేస్తారని అనుకునే వారు. కానీ వారందరి కంటే కూడా నలుగురిలో ఎక్కువగా బోనికి తన చిన్న కుట్టి, ఖుషీ అంటే ఎక్కువ ఇష్టమని అన్హులా చెప్పారు. ఇదే విషయాన్ని శ్రీదేవి కూడా ఓ ఇంటర్వ్యూ సందర్భంగా చెప్పారు. ఖుషీ ఎక్కువగా బోనికి క్లోజ్‌ అని, జాన్వీ తనపై ఎక్కువగా ఆధారపడుతుందని తెలిపారు. అయితే బోని నిజాయితీగా అందర్ని సమానంగా ప్రేమిస్తారని కూడా అన్హులా చెప్పుకొచ్చారు. 

మరో యూజర్‌, మీ తోబుట్టువుల్లో మీకు నచ్చే విషయమేమిటని అడుగగా.. ‘వారి హార్ట్‌, వారి బలం, చీకటి రోజుల్లో కూడా వారు ఎప్పుడూ వెలుతురు వైపే చూసే సామర్థ్యం కలిగి ఉండటం.. కారణం లేకుండా వారు నన్ను నవ్వించగలగడం.. కానీ ఎక్కువగా వారు నా వారు అని చెప్పుకోవడాన్ని ప్రేమిస్తాను’ అని అన్హులా ఎంతో భావోద్వేగంతో చెప్పారు. బోని కపూర్‌ ఇద్దరూ భార్యలు చనిపోయిన సంగతి తెలిసిందే. మొదటి భార్య మోనా కపూర్‌ 2012లో క్యాన్సర్‌తో చనిపోగా.. రెండో భార్య శ్రీదేవీ దుబాయ్‌లో బాత్‌టబ్‌లో పడి ఈ ఏడాది ఫిబ్రవరిలో కన్నుమూశారు. అప్పటి నుంచి నలుగురు తోబుట్టువులు, తండ్రి తోడుగా, ఆయన్ని నవ్విస్తూ.. ఎంతో సానిహిత్యంతో మెలుగుతున్నారు.