చూశారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే...

చూశారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే...

  రామ్‌ చరణ్‌ ఈ సారి కటుంబ కథా చిత్రంలో నటిస్తున్నాడని సోమవారం విడుదల చేసిన 'వినయ విధేయ రామ' చిత్రం తొలిపాట ద్వారా చెప్పారు. 'తందానే తందానే.. చూశారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే.. తందానే తందానే.. కన్నారా ఎవరైనా ప్రతి రోజు పండగనే..ఏ తియ్యదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలను... ఏ చిరునవ్వు రుణపడుతూ రాసిందో గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే తందానే తందానే.. అంటూ సాగే పాట ఆకట్టుకుంది. అందులోనూ 'బంధాల గ్రంథాలయమే ఉందీ ఇంట్లోనే..' అంటూ కుటుంబ విలువలు, మమకారాల్ని ఈ గొప్పగా చెప్పే ప్రయత్నం చేశారు రచయిత. ఈ గీతాన్ని ఎమ్‌.ఎల్‌.రామ్‌ కార్తికేయన్‌ ఆలపించారు. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు అందిస్తున్నారు. కియారా అద్వాని కథానాయిక. వివేక్‌ ఒబెరారు, ప్రశాంత్‌, ఆర్యన్‌ రాజేష్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.