క్రికెట్ ఆడిన క‌త్రినా కైఫ్ ....

క్రికెట్ ఆడిన క‌త్రినా కైఫ్ ....

 మేక‌ప్‌లు వేసుకొని సినిమాల‌తో బిజీగా ఉండే క‌త్రినా కైఫ్ గ్రౌండ్‌లో అడుగుపెట్టింది. క్రికెట‌ర్ అవ‌తారంలోకి మారిన ఈ అమ్మ‌డు బ్యాట్‌తో బంతిని బౌండ‌రీ లైన్‌కి త‌ర‌లించింది. గ్రౌండ్‌లో ఉన్నవాళ్లంద‌రు క‌త్రినా బ్యాటింగ్ తీరు చూసి మురిసిపోయారు. దీనికి సంబంధించిన వీడియోని క‌త్రినా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ వ‌ర‌ల్డ్ క‌ప్ టీంలో త‌న‌ని ఎంపిక చేయ‌మ‌ని అనుష్క శ‌ర్మని కోరింది. వివరాల‌లోకి వెళితే కత్రినా కైఫ్ ప్ర‌స్తుతం భార‌త్ అనే చిత్రంతో బిజీగా ఉండ‌గా, రీసెంట్‌గా జీరో అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇందులో అనుష్క శ‌ర్మ కూడా ముఖ్య పాత్ర పోషించింది. అయితే తాను న‌టిస్తున్న భార‌త్ మూవీకి ప్యాక‌ప్ చెప్ప‌గానే తోటి వారితో క‌లిసి క్రికెట్ ఆడింది క‌త్రినా .

అందుకు సంబంధించిన వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ జీరో కోస్టార్ అనుష్క శ‌ర్మ‌కి మెసేజ్ ఇచ్చింది నా బ్యాటింగ్ తీరు చూసి వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఆడే అవ‌కాశం ఇవ్వ‌మని మీ భ‌ర్త ( విరాట్ కోహ్లీ)కి సూచ‌న చేయ‌వు. నేను ప్రాక్టీస్‌లో నిమ‌గ్న‌మై ఉన్నాను. మంచి ఆల్ రౌండ‌ర్‌గా జ‌ట్టుకి సేవ‌లందిస్తానంటూ ఫ‌న్నీ కామెంట్ పెట్టింది కత్రినా. ప్ర‌స్తుతం క‌త్రినా క్రికెట్ వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.