>

దీపిక నడుముతో పెద్ద తలనొప్పి!

దీపిక నడుముతో పెద్ద తలనొప్పి!

 పద్మావత్‌ చిత్ర విడుదలకు క్లియరెన్స్‌ లభించినా మేకర్లకు మాత్రం చిక్కులు తప్పటం లేదు. ఓవైపు కర్ణి సేన హెచ్చరికల నేపథ్యంలో ఆందోళన చెందుతున్న దర్శకనిర్మాత సంజయ్‌ లీలా భన్సాలీ.. మరోవైపు సెన్సార్‌ బోర్డు సూచనల మేరకు చిత్రానికి మరమ్మత్తులు పనిలో బిజీగా ఉన్నాడు.  ఈ క్రమంలో ఆయనకు ఓ కొత్త సమస్య ఎదురైందని తెలుస్తోంది. ఈ చిత్రంలో గూమర్‌ సాంగ్‌లో పద్మావతిగా దీపిక వేసిన స్టెప్పులు అందరినీ ఆకర్షించాయి. కానీ, కర్ణిసేన మాత్రం ఆ పాట పై కన్నెర్ర చేసింది. రాణి పద్మావతి అలా గంతులేయటం ఏంటని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 

ఈ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్న సెన్సార్‌ బోర్డు ప్యానెల్‌ సభ్యులు ఆ పాటను కూడా ఎడిట్‌ చేయాల్సిందేనని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పాటలో దీపిక నడుము కనిపించే షాట్లను తొలగించాలని సూచించింది. అయితే అది మొత్తం పాట పైనే ప్రభావం చూపే అవకాశం ఉండటంతో భన్సాలీ ఓ నిర్ణయానికి వచ్చాడు. కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ వర్క్‌ ద్వారా దీపిక నడుమును కప్పిపుచ్చే యత్నం చేస్తున్నాడంట. అయితే ఈ ఎడిటింగ్‌ పనుల వల్ల చిత్రం జనవరి 25 తేదీన విడుదలయ్యే అవకాశం తక్కువగా కనిపిస్తోందని బాలీవుడ్‌ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.