డైరెక్టర్ మాజీ భార్య.....నగ్నంగా!

డైరెక్టర్ మాజీ భార్య.....నగ్నంగా!

 బాలీవుడ్ సినిమాలు చూసే వారికి ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్య కశ్యప్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. బొంబాయి బాంబు పేలుళ్లు గూర్చి తీసిన బాలీవుడ్ మూవీ 'బ్లాక్ ఫ్రైడే' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అనురాగ్ కశ్యప్, దాని తరువాత నో స్మోకింగ్, దేవ్ డి, గులాల్, గ్యాంగ్స్ ఆఫ్ వాస్సెపూర్, బాంబే టాకీస్, అగ్లీ, బాంబే వెల్వెట్ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. నిర్మాతగా, దర్శకుడిగా, స్క్రీన్ రైటర్, నటుడిగా ఇలా మల్టీ టాలెంట్ ఉన్న వ్యక్తి. అనురాగ్య కశ్యప్ సినిమాల సంగతి పక్కన పెడితే... మొదటి భార్య ఆర్తి బజాజ్‌కు విడాకులు ఇచ్చిన తర్వాత.... నటి కల్కి కోచ్లిన్‌‌ని 2011లో పెళ్లి చేసుకున్నాడు. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన 'దేవ్ డి' చిత్రం ద్వారా పాండిచ్చేరికి చెందిన ఈ ఫ్రెంచి సంతతి భామ సినిమా రంగంలో అడుగు పెట్టింది. 2015 అనురాగ్ కశ్యప్‌తో విడిపోయిన కల్కి ప్రస్తుతం నటిగా బిజీ అపోయారు. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేసిన ఓ ఫోటో వైరల్ అయింది. ఒంటిపై నూలు పోగుకూడా లేకుండా నగ్నంగా ఈ ఫోటో ఉండటం గననార్హం.మీ నగ్నత్వాన్ని మీరు ప్రేమించండి అంటూ... ఆమె ఈ ఫోటో పోస్టు చేశారు. పాశ్చత్య దేశాల్లో న్యూడిటీకి ప్రాధాన్యత పెరుగుతున్న తరుణంలో...కల్కి కొచ్లిన్ లాంటి తారలు ఇండియాలో కూడా న్యూడిటీని పాపులర్ చేయాలని కంకణం కట్టుకున్నట్లు చర్చించుకుంటున్నారు.

  కల్కి కొచ్లిన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఆమె నటించిన జియా ఔర జియా, రిబ్బన్ చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకుని పోస్టు ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. క్యాండీ ప్లిప్, అజమాయిష్-ట్రయల్స్ ఆఫ్ లైఫ్ చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి.కల్కి కొచ్లిన్ పాండిచ్చేరిలో పుట్టింది. ముంబై రాక ముందు ఆమె పాండిచ్చేరి, ఊటి ప్రాంతంలో పెరిగింది. ఆమె తల్లిదండ్రులు, పూర్వీకులు ఫ్రెంచి జాతీయులు. పాండిచ్చేరి ఫ్రెంచి పాలనలో ఉన్న సమయంలో వారు ఇండియాకు వచ్చారు. కొచ్లిన్ తాత ఈఫిల్ టవర్ నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన ఇంజనీర్.