డర్టీ పిక్చర్‌ నా జీవితాన్ని ఎప్పటికీ మార్చలేదు

డర్టీ పిక్చర్‌ నా జీవితాన్ని ఎప్పటికీ మార్చలేదు

  సిల్క్‌ స్మిత జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం 'డర్టీ పిక్చర్‌'. సిల్క్‌ పాత్రలో విద్యాబాలన్‌ నటించింది. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం విడుదలై ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా విద్యాబాలన్‌ సామాజిక మాధ్యమంలో ఓ పోస్టు పెట్టింది. ఈ చిత్రం ఎప్పటికీ తన జీవితాన్ని మార్చలేదని పేర్కొంది. 'ఏడేళ్ల క్రితం అంటే 2011 డిసెంబర్‌ రెండో తేదీ. అది 'దర్టీ పిక్చర్‌' విడుదలైన రోజు. ఆ నా సినిమా జీవితాన్ని ఎప్పటికీ మార్చలేదు. కానీ ఈ పాత్ర ఎలా చేశావని ప్రతిసారీ చాలా మంది నన్ను అడుగుతున్నారు. ఏం చెప్పాలో నాకు అర్ధం కావడం లేదు. సిల్క్‌లా నటించేలా మిలాన్‌ నన్ను మార్చేశారు. అలా హ్యాండిల్‌ చేశారు'' అని పేర్కొంది. కానీ ఇదే చిత్రం తుస్సార్‌ కపూర్‌, నజీరుద్దీన్‌ షా, ఇమ్రాన్‌ హష్మి వంటి వారు నటించినా సిల్క్‌ పాత్రే ప్రేక్షకుల గుండుల్లో నిలిచిపోయింది. ఆ ఏడాది ఈ పాత్రలో నటించనందుకు గానూ విద్యా బాలన్‌కు నేషనల్‌ అవార్డు కూడా వరించింది.