ఏడేళ్ల తరువాత.. ఆ నటి మళ్లీ..!

ఏడేళ్ల తరువాత.. ఆ నటి మళ్లీ..!

  చెన్నై: ఏడేళ్ల తర్వాత నూతన ఉత్సాహంతో హీరోయిన్‌ మమతా మోహన్‌దాస్‌ మళ్లీ తెరపైకి రానుంది. ఆమె చాలా మంది యువతకు స్పూర్తి అని చెప్పవచ్చు. ఎందుకంటే క్యాన్సర్‌ మహమ్మారిని జయించి నిలిచిన అతికొద్ది మందిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. పలు చిత్రాలో నటించిన ఈ నటి తాజాగా తన రీఎంట్రీని మొదలెట్టింది. ప్రస్తుతం కోలీవుడ్‌లో రెండు అవకాశాలను దక్కించుకుంది ఈ బ్యూటీ. అందులో ఒకటి డాన్సింగ్‌ కింగ్‌ ప్రభుదేవాతో రొమాన్స్‌ చేసే అవకాశం. ఆయన నటిస్తున్న యంగ్‌ మంగ్‌ ఛంగ్‌ చిత్రం నిర్మాణంలో ఉంది. 

కార్తీక్‌ సుబ్బారాజ్‌ దర్శకత్వంలో మెర్కురీ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. ప్రస్తుతం ఆయన మరో చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభుదేవాకు జంటగా నటి మమతా మోహన్‌దాస్‌ నటిస్తోంది. ఆ చిత్రానికి ఊమై విళిగల్‌ అనే టైటిల్‌ను నిర్ణయించారు.మరో చిత్రాన్ని కూడా ఆమె అంగీకరించింది. పార్థిబన్‌ స్వీయ దర్శకత్వంలో నటించనున్న ఉళై వెళియో 2 చిత్రంలో ఆయనకు జంటగా నటించబోతుంది. ఈ చిత్రాల విడుదల తర్వాత ఈ అమ్మడిని మరిన్ని అవకాశాలు వరించే అవకాశం ఉందని చెప్పవచ్చు.