ఈ మధుర జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుంటాయి

ఈ మధుర జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుంటాయి

 బాలీవుడ్‌ కథానాయిక ప్రియాంకా చోప్రా, అమెరిక గాయకుడు, గీత రచయిత నిక్‌ జొనాస్‌ వివాహం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లోని ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. జోధ్‌పూర్‌లోని ఉమైద్‌ భవన్‌ ప్యాలెస్‌లో జరిగిన ఈ వేడుకులో భాగంగా సంగీత్‌ నిర్వహించారు. అందులో ప్రియాంక, నిక్‌ జొనాస్‌ డాన్స్‌లు చేస్తూ ఆనందంగా కనిపించారు. దానికి ముందు వీరంతా క్రికెట్‌ ఆడారు. ఆ తర్వాత గాయకుడిగా నిక్‌ పాట పాడితే, నటిగా ప్రియాంక ఆ పాటకు ఉత్సాహంగా డాన్స్‌ చేసింది. ఈ వీడియోలను తాజాగా ప్రియాంక, నిక్‌ తమ ట్విట్టర్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల్లో పోస్టు చేశారు. 

ఇవి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. సంగీత్‌ వేడుకలో అయితే చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ వేదికపై డ్యాన్స్‌ చేశారు. వేడుక మొత్తం సంబరాలు, నవ్వులతో నిండిపోయింది. ప్రియాంక తల్లి మధు చోప్రాతో కూడా స్టెప్పులేసింది. పరిణీతి చోప్రా 'టైటానిక్‌' సినిమాలోని పాటకు డ్యాన్స్‌ చేసింది. ఇవన్నీ డాన్స్‌ పోటీల్లో భాగంగా నిర్వహించామని ప్రియాంక ఈ సందర్భంగా చెప్పింది. ''అందరూ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. పాటల రూపంలో కుటుంబ సభ్యులు తమ కథలను వివరించారు. ప్రేమ, నవ్వులతో సంగీత్‌నిండిపోయింది. ఈ మధుర జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుంటాయి' అని ప్రియాంక తెలిపింది.