ఈ రోజు ఈషా గుప్తా టైం

ఈ రోజు ఈషా గుప్తా టైం

  1975లో ఇందిరా గాంధీ ప్ర‌ధానిగా ఉన్న‌ప్పుడు ఎమ‌ర్జెన్సీ విధించారు. అప్ప‌టి ప‌రిస్థితుల‌ నేప‌ధ్యంలో బాద్‌షాహో అనే చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు ద‌ర్శ‌కుడు మిలాన్ లుత్రియా. అజ‌య్ దేవ‌గ‌న్ ప్రధాన పాత్ర‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో ఇమ్రాన్ హ‌ష్మీ, ఇషా గుప్తా, సంజ‌య్ మిశ్రా ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. కొద్ది రోజులుగా చిత్రంలోని ప్ర‌ధాన పాత్ర‌ల‌కి సంబంధించిన పోస్ట‌ర్స్ ని విడుద‌ల చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ఇమ్రాన్ హ‌ష్మీ, విద్యుత్ జాంవాల్, ఇలియానా లుక్స్ ని విడుద‌ల చేసిన‌ చిత్ర యూనిట్ తాజాగా ఇషా గుప్తా లుక్ విడుద‌ల చేసింది. రావిషింగ్ లుక్ లో ఉన్న ఇషాని చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. సెప్టెంబ‌ర్ 1న విడుద‌ల కానున్న ఈ చిత్ర ప్ర‌మోష‌న్స్ మాత్రం మూవీపై భారీ అంచ‌నాలే పెంచుతున్నాయి.