పెళ్లి అయింద‌ని చెప్ప‌డానికి ఇదే స‌రైన స‌మ‌యం

పెళ్లి అయింద‌ని చెప్ప‌డానికి ఇదే స‌రైన స‌మ‌యం

  బాలీవుడ్ హీరో అభిషేక్ బ‌చ్చ‌న్ రెండేళ్ళ త‌ర్వాత మ‌రోసారి త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోబోతున్నాడు . అనురాగ్ క‌శ్య‌ప్ ద‌ర్శ‌క‌త్వంలో అభిషేక్ చేస్తున్న తాజా ప్రాజెక్ట్ పేరు ‘మన్‌మర్జాయన్‌’ . ఆనంద్ ఎల్ రాయ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విక్కీ కౌశాల్‌, తాప్సీ ప‌న్ను ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. తొలిసారి అభిషేక్‌తో క‌లిసి తాప్సీ ఈ చిత్రంలో న‌టిస్తుంది. సెప్టెంబర్‌ 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రాన్ని టిఫ్‌(టొరంటో అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌)లో ప్ర‌ద‌ర్శించారు. అయితే ఈ కార్య‌క్ర‌మంకి హాజ‌ర‌య్యేందుకు అభిషేక్‌కి ఓ ఐడీ కార్డ్ ఇచ్చారు. ఆ ఐడీలో అభి ఫొటో కింద ‘హజ్బెండ్‌ మెటీరియల్‌’(పెళ్లి చేసుకుంటే మంచి భర్త అవుతారు) అని రాశారు. ఇది చూసి షాక్ అయిన అభి త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.


త‌న‌కి ఇచ్చిన ఐడీ కార్డ్‌ని ఫోటో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన అభిషేక్..నాకు ఇంత‌క‌ముందే పెళ్ళైంద‌ని చెప్ప‌డానికి స‌రైన స‌మయం అంటూ కామెంట్ పెట్టాడు. అయితే టిఫ్‌ నిర్వాహకులు అభి ఐడీపై అలా రాయ‌డానికి కార‌ణ‌మేంటా అని ఆరాలు తీయ‌గా మన్మర్జియా చిత్రాన్ని విదేశాల్లో ‘హజ్బెండ్‌ మెటీరియల్‌’ పేరుతో విడుదల చేస్తున్నారట. ఈ నేప‌థ్యంలో అంద‌రికి తెలియ‌డానికి నిర్వాహ‌కులు అలా చేశారని బాలీవుడ్ వ‌ర్గాలు అంటున్నాయి. టిఫ్ 2018 కార్య‌క్ర‌మం సెప్టెంబ‌ర్ 6 నుండి 16వ‌ర‌కు జ‌ర‌గ‌నుండ‌గా ఈ కార్య‌క్ర‌మంలో మన్మర్జియా చిత్రంతో పాటు మంటో, మార్డ్ కో డార్డ్ న‌హో హోతా, బుల్ బుల్ కెన్ సింగ్‌, ది స్వీట్ రెక్విమ్‌,రియాసో, స‌ర్కిల్‌, ది ఫీల్డ్ త‌దిత‌ర చిత్రాల‌ని ప్ర‌ద‌ర్శించారు.