ఎవరేం మాట్లాడుకున్నా కేర్ చేయనన్న శృతి

ఎవరేం మాట్లాడుకున్నా కేర్ చేయనన్న శృతి

 పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్టు సినీభామల తీరు తెన్నులు వేరయా అని కూడా చెప్పుకోవచ్చు. తమ గ్లామర్ తో స్క్రీన్ ను డామినేట్ చేసే ఈ భామలు తమ పర్సనల్ లైఫ్ గురించి పబ్లిక్ కు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. అయితే కొందరు మాత్రం వాళ్ల గురించి ఎవరేమన్నా పట్టించుకోనంటున్నారు. శృతిహాసన్ కూడా ఈ కోవలోకే వస్తుంది. తన గురించి ఎవరేం మాట్లాడుకున్నా లెక్క చేయనని, పట్టించుకోననీ అంటోంది శృతి . ఎవరేం మాట్లాడుకొంటే నాకేంటి? అని కేర్ లెస్ గా అంటోంది. కొందరు తమ గురించి ఎవరేమన్నా, అనుకున్నా ఫీలవుతారని, టెన్షన్ పడతారని చెబుతూ .. సోషల్ మీడియాలో వచ్చే మేటర్స్ చూసి కంగారుపడడం తన మెంటాలిటీ కాదని, అసలు కేర్ చేయనని అంటోంది. సౌత్ లో తెలుగు, తమిళ మూవీస్ లో యాక్ట్ చేసి, ఎన్నో సక్సెస్ లు అందుకున్న శ్రుతి త్వరలో కన్నడ సినిమాలు చేస్తుందని టాక్.