గ్రాండ్ గా శిల్పా శెట్టి బర్త్ డే వేడుక

గ్రాండ్ గా శిల్పా శెట్టి బర్త్ డే వేడుక

  బాలీవుడ్ అందాల తారలలో శిల్పాశెట్టి ఒకరు. యూ.పి. బిహర్ లూట్నే, షటప్ అండ్ బౌన్స్ తదితర పాటలతో ప్రపంచాన్ని ఊపేసింది. ఫిట్ నెస్ క్వీన్ గా అందరిని షాక్ కి గురి చేస్తున్న శిల్పా తన 43వ బర్త్ డేని జూన్ 8న తన ఫ్యామిలీతో కలిసి సరదాగా జరుపుకుంది. ఈ వేడుకలలో శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా, కొడుకు వియాన్, సోదరి షమిత, తల్లి సునంద పాల్గొన్నారు. బాలీవుడ్ యాక్ట్రెస్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కూడా బర్త్ డే వేడుకలలో పాల్గొనడం విశేషం. 


తన సతీమణి బర్త్ డే సందర్భంగా రాజ్ కుంద్రా కోకోనట్ షుగర్ బర్త్ డే కేక్ కట్ చేయించాడు. పూజా దింగ్రా అనే చెఫ్ తో స్పెషల్ గా చేయించిన ఈ కేక్ పై శిల్పా బొమ్మని ఉంచి ఎదురుగా నిచ్చెన ఉంచారు. ఇక క్యాప్షన్ గా శిల్ప పాపులర్ లైన్ సూపర్ సే ఉపర్ అనే ఉపశీర్షిక ని ఉంచారు. శిల్పా శెట్టి తనయుడు తన తల్లి కోసం స్పెషల్ గ్రీటింగ్ తయారు చేసి ఇచ్చాడు. వీటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది శిల్పా శెట్టి. ఇవి వైరల్ గా మారాయి. బాలీవుడ్ నటి శిల్పా శెట్టి , ప్రముఖ బిజినెస్ మెన్ రాజ్ కుంద్రా నవంబర్ 22,2009న వివాహ బంధంతో ఒక్కటయిన విషయం విదితమే. తొమ్మది ఏళ్ల వివాహబంధంలో వీరికి వియాన్ అనే కుమారుడు మాత్రమే ఉన్నాడు.