జిమ్‌లో జాన్వీకపూర్ ఫిట్ నెస్ వ‌ర్కౌట్స్ ..!

జిమ్‌లో జాన్వీకపూర్ ఫిట్ నెస్ వ‌ర్కౌట్స్ ..!

 అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ ‘ధడక్’ అనే మూవీతో వెండితెర‌కి డెబ్యూ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో షాహిద్ కపూర్ బ్రదర్ ఇషాన్ కట్టర్ స‌ర‌స‌న జాన్వీకపూర్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. సూపర్ హిట్ మరాఠి చిత్రం సైరత్ కు రీమేక్‌గా శశాంక్ కైతాన్ డైరెక్షన్‌లో ఈ మూవీ తెర‌కెక్కుతుంది. అయితే ఇటీవ‌ల చిత్రానికి సంబంధించి విడుద‌లైన పోస్ట‌ర్స్‌లో జాన్వీని చూస్తుంటే అచ్చం శ్రీదేవిలానే ఉంద‌ని ప‌లువురు చెప్పుకొచ్చారు. 

జాన్వీది ఒక్క సినిమా కూడా రిలీజ్ కాక‌పోయిన ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తొలి చిత్రంతో ఎలా అయిన త‌న అభిమానుల‌ని అల‌రించాల‌ని, త‌ల్లికి త‌గ్గ త‌న‌య‌గా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఉవ్విళ్ళూరుతుంది . ఇక ఫిట్‌నెస్ విష‌యంలో ఏ మాత్రం తేడా రాకుండా ఎప్ప‌టిక‌ప్పుడు జాగ్ర‌త్త ప‌డుతుంటుంది జాన్వీ. జిమ్‌లో భారీ వ‌ర్కౌట్స్ చేస్తూ ఫిట్ నెస్ కాపాడుకుంటుంది . తాజాగా ట్రైన‌ర్స్ స‌హాయంతో తాను జిమ్ చేస్తున్న వీడియో ఒకటి బ‌య‌ట‌కి వ‌చ్చింది. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి. 

https://www.youtube.com/watch?v=o76oDtHnDFU