హాకీప్లేయర్‌గా టాలీవుడ్ హీరోయిన్..

హాకీప్లేయర్‌గా టాలీవుడ్ హీరోయిన్..

 హైదరాబాద్: రవితేజ, ప్రభాస్, వెంకీ వంటి స్టార్ హీరోలతో నటించి టాలీవుడ్‌లో స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది ఢిల్లీ బ్యూటీ తాప్సీ. ఆ తర్వాత తాప్సీ పింక్ మూవీలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించే అరుదైన ఛాన్స్ కొట్టేసింది. కొంత విరామం తర్వాత ఇటీవలే ఆనందోబ్రహ్మ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన తాప్సీ..మరో క్రేజీ ప్రాజెక్టులో నటించనుంది. 


ప్రముఖ భారత మాజీ హాకీ ప్లేయర్ సందీప్ సింగ్ బయోపిక్‌లో తాప్సీ కీలక పాత్రలో కనిపించనున్నట్లు బాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి. తాప్సీతోపాటు ఉడ్తా పంజాబ్ ఫేం దిల్జీత్ దోసాంజ్ మరో ఇంపార్టెంట్ రోల్‌లో కనిపించనున్నట్లు టాక్. ఈ చిత్రంలో తాప్సీ, దిల్జీత్ దోసాంజ్ హాకీ క్రీడాకారులుగా కనిపించనున్నారట. షాద్ అలీ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. తాప్సీ, దిల్జీత్ ఈ చిత్రం కోసం హాకీలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకోనున్నారట.