ఇలియానాకు పెళ్లయ్యిందా?

ఇలియానాకు పెళ్లయ్యిందా?

  సౌత్‌ లో స్టార్ ఇమేజ్‌ ను వదులుకొని బాలీవుడ్ బాట పట్టిన బ్యూటీ ఇలియానా. అడపాదడపా బాలీవుడ్ సినిమాలు చేస్తున్న ఈ భామకు ప్రస్తుతం దక్షిణాదిలో ఒక్క అవకాశం కూడా లేదు. ఇటీవల సౌత్ ఇండస్ట్రీలో తాను ఇబ్బందులు ఎదుర్కొన్నానంటూ సంచలన ప్రకటన చేసి మరోసారి సౌత్‌ సినీ అభిమానుల దృష్టిని ఆకర్షించింది ఈ బ్యూటి. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ పర్సనల్‌ ఫోటోలను పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది.

గత డిసెంబర్‌లో తన ఇన్‌స్ట్రాగామ్‌లో ఒక ఫొటో, కొన్ని వ్యాఖ్యలను ట్వీట్‌ చేసింది ఇలియానా. అందులో ‘ఇది చాలా సంతోషకరమైన తరుణం. క్రిస్‌మస్‌ ఆనందం, సెలవులు, ఇల్లు, కుటుంబం, ప్రేమ’ అంటూ పోస్ట్‌ చేసింది. ఆ ఫొటోపై భర్త ఆండ్రూ నీబోర్‌ అని పేర్కొంది. దీంతో ఇలియానా పెళ్లి చేసుకుందనే ప్రచారం హోరెత్తుతోంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఇలియానా నటించిన రైడ్‌ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ చిత్ర ప్రమోషన్‌లో పాల్గొన్న ఈ బ్యూటీని పెళ్లి విషయం గురించి మీడియా ప్రతినిథి ప్రశ్నించగా ‘ఈ విషయం గురించి ఎక్కువగా మాట్లాడడం నాకిష్టం లేదు’ అంటూ సమాధానం దాటవేసింది. ఇంతకీ ఇలియానాకు పెళ్లి అయినట్టా? లేనట్టా?ఈ ప్రశ్నకు ఆమె నుంచి సూటిగా బదులు ఆశించడం ఇంకా సబబు కాదనుకుంటా!