ఇంటర్నెట్‌లో సింగర్ హాట్ ఫోటో వైరల్ 

ఇంటర్నెట్‌లో సింగర్ హాట్ ఫోటో వైరల్ 

 బాలీవుడ్‌లో నేహా భాసిన్ గురించి తెలియని వారుండరు. ఎందుకంటే ఆమెకున్న క్రేజ్ అలాంటింది. కమ్మనైన గొంతుతో, ఆకట్టుకునే అందంతో.. నేహా తన పాటలతో కుర్రకారును మత్తెక్కిస్తోంది. స్కిన్ షోకు ఏ మాత్రం వెనకాడకుండా హాట్ హాట్ ఫోటోలతో నేహా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె ఇన్‌స్టాగ్రాం నిండా ఇలాంటి ఫోటోలే కనిపిస్తాయి. గ్లామర్ ఉంది చూపించడానికే అన్నంతగా ఉండే ఈమె ఫోటోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. 

అయితే ఇటీవల ఆమె పోస్ట్ చేసిన ఓ ఫోటోపై మిశ్రమ స్పందన వస్తుంది. కొందరు ఏం అందం అంటూ పొగుడుతుంటే, మరికొందరు మాత్రం నేహా హద్దులు దాటుతోందంటూ విమర్శిస్తున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇలాంటి ఫోటోలు పోస్ట్ చేసి సభ్య సమాజానికి ఏం మెసేజ్‌లిద్దామని అంటూ నేహాపై విరుచుకుపడుతున్నారు. అయితే విమర్శలను ఏ మాత్రం పట్టించుకోకుండా నేహా భాసిన్ తన అందాలతో కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.