జాన్వీకపూర్, సారా అలీఖాన్ ను పోల్చవద్దు..

జాన్వీకపూర్, సారా అలీఖాన్ ను పోల్చవద్దు..

 జాన్వీకపూర్, సారా అలీఖాన్..ఇద్దరమ్మాయిలది 21, 22 ఏళ్ల వయస్సు. వారిని ఒకరినొకరిని పోల్చడం ఈ వేదికపై సరికాదని ప్రముఖ దర్శక నిర్మాత కరణ్‌జోహార్ అన్నారు. రణ్‌వీర్‌సింగ్, సారా అలీఖాన్ నటించిన సింబా ట్రైలర్‌ను కరణ్ జోహార్ విడుదల చేశారు.ఈ సందర్భంగా జాన్వీ, సారాలో ఎవరు ఎక్కువ అవార్డులు తీసుకుంటారని రిపోర్టర్లు కరణ్‌ను ప్రశ్నించారు. దీనికి కరణ్ జోహార్ స్పందిస్తూ..జాన్వీ, సారా అందమైన, అద్భుతమైన అమ్మాయిలు. చాలా బాగా కష్టపడతారు. అవార్డులు అనేవి ముఖ్యం కాదు. వాళ్లు పనిచేస్తరు..ప్రతీ అవార్డును, ప్రేమను ప్రజల నుంచి పొందుతారని అన్నారు. తాను రోహిత్‌శెట్టితో కలిసి సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఎదురుచూశానని, ఇప్పటికి సింబా చిత్రంతో ఆ కోరిక నెరవేరిందని కరణ్‌జోహార్ అన్నారు. జాన్వీకపూర్ కరణ్‌జోహార్ దర్శకత్వంలో వచ్చిన ధఢక్ చిత్రంతో జాన్వీకపూర్ తెరంగేట్రం చేయగా..సారా అలీఖాన్ కేదార్‌నాథ్ చిత్రంతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.