‘జూలీ 2’...సెక్సీగా, నగ్నంగా లక్ష్మీరాయ్...

‘జూలీ 2’...సెక్సీగా, నగ్నంగా లక్ష్మీరాయ్...

  'కాంచనమాల కేబుల్ టీవీ' అనే తెలుగు సినిమా ద్వారా హీరోయిన్‌గా ప్రస్తానం మొదలు పెట్టిన లక్ష్మీ రాయ్..... 'జూలీ 2' సినిమా ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. తొలి సినిమాతోనే బాలీవుడ్ ప్రేక్షకులను తన అందాల మత్తులో ముంచెత్తబోతోంది. ఇప్పటికే విడుదలైన 'జూలీ 2' ఫస్ట్ లుక్ పోస్టర్లు బాలీవుడ్ జనాల్లో అంచనాలు భారీగా పెంచింది. తాజాగా 'జూలీ 2' చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల చేశారు. గతంలో ఎన్నడూ లేనంత సెక్సీగా లక్ష్మీరాయ్ ఈ చిత్రంలో కనిపించబోతోంది. టీజర్లో ఇచ్చిన కొన్ని హింట్స్ పరిశీలిస్తే ఈ చిత్రంలో లక్ష్మీ రాయ్ నగ్నంగా నటించిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బీచ్ ఒడ్డున్న బికినీ విప్పేస్తూ ఉన్న సీన్లు ఉండటమే ఇందుకు కారణం.
 గతంలో ‘జూలీ' సినిమాలో నేహా ధూపియా టాప్ లెస్ సీన్లు చేసింది. దానికి సీక్వెల్‌గా వస్తున్న ‘జూలీ 2' చిత్రంలో అంతకు మించిన హాట్ అండ్ సెక్సీ సీన్లు ఉండటం కాయం అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ సినిమాలో మరింత అందంగా కనిపించడం కోసం లక్ష్మీ రాయ్ ఏకంగా 10 కిలోల బరువు తగ్గిందట. ఈ సినమా కోసం అమ్మడు ఎంత అందంగా మారిందో మీరూ ఓ లుక్కేయండి. సెక్సీ రాయ్ రాయ్ లక్ష్మీ ట్విట్టర్ ద్వారా ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్ అభిమానులకు చేసింది. ఈ సినిమా తర్వాత ఆమెను అందరూ ఇపుడు సెక్సీ రాయ్ అని పిలుస్తారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

బాలీవుడ్ లో ఆమెకు ఇదే తొలి చిత్రం. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉవ్విల్లూరుతున్న లక్ష్మీరాయ్ గతంలో కంటే మరింత హాట్ అండ్ సెక్సీగా ఈ చిత్రంలో కనిపించబోతోంది. ఈ సినిమాలో ఆమె బికినీ అందాలతో యువతను ఉక్కిరి బిక్కిరి చేయనుంది.

‘జూలీ 2' చిత్రానికి దీపక్. ఎస్ శివదాసాని దర్శకత్వం వహిస్తున్నారు. ఒక సాధారణ అమ్మాయి స్టార్ గా ఎలా ఎదిగింది అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఇండియాతో పాటు దుబాయ్ తదితర ప్రాంతాల్లో ఈ సినిమాను తెరకెక్కించారు. అక్టోబర్ 6న సినిమా రిలీజ్ కాబోతోంది.

 https://www.youtube.com/watch?v=2VMjcw8V2KE