క‌రీనా...మ్యాగ‌జైన్ ఫోటో షూట్ ..!

క‌రీనా...మ్యాగ‌జైన్ ఫోటో షూట్ ..!

  బాలీవుడ్‌లో ఒక‌ప్పుడు యూత్ క‌ల‌ల రాణిగా ఉన్న క‌రీనా ఏడాది క్రితం తైమూర్ అనే బిడ్డ‌కి జ‌న్మ‌నిచ్చింది. రీసెంట్‌గా కొడుకు మొద‌టి సంవ‌త్సరం బ‌ర్త్‌డే వేడుక‌ల‌ని హ‌ర్యానాలో గ్రాండ్‌గా జ‌రిపింది. ఆ త‌ర్వాత భ‌ర్త సైఫ్ అలీ ఖాన్‌తో క‌లిసి న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ చేసుకుంది. ఈ సెల‌బ్రేష‌న్స్‌లో క‌రీనా ఇచ్చిన ఫోజులు చూస్తుంటే ఓ బిడ్డ‌కు త‌ల్లిలా, 37 ఏళ్ళ వ‌య‌స్సున్న‌ భామ‌లా ఎవ‌రికి డౌటే రావ‌డం లేదు. కొడుకు పుట్టిన త‌ర్వాత కూడా క‌రీనా త‌న గ్లామ‌ర్‌ని అంతే మెయింటైన్ చేస్తూ , కుర్ర భామ‌ల‌కి షాక్ ఇస్తుంది. రీసెంట్‌గా ఓ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజ్ కోసం క‌రీనా ఫోటో షూట్ చేసింది. ఈ ఫోటోలు చూసిన జ‌నాలు క‌రీనా అప్పుడెలా ఉందో ఇప్పుడు అంతే సెక్సీగా ఉందంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. కెరీర్‌కి పెళ్ళి, పిల్ల‌లు ఏ మాత్రం అడ్డు కాబోవ‌ని మ‌రో సారి ఈ ఫోటో షూట్‌తో నిరూపించింది క‌రీనా.