కిస్సింగ్ హీరోపై ఐశ్వర్య సీరియస్!

కిస్సింగ్ హీరోపై ఐశ్వర్య సీరియస్!

  కిస్సింగ్ హీరోగా బాలీవుడ్‌లో ప్రత్యేక స్థానం సంపాదించిన ఇమ్రాన్ హష్మీపై ఐశ్వర్యరాయ్ సీరియస్ అయింది. ఎప్పుడో అతడు తన గురించి చేసిన కామెంట్స్‌ను గుర్తు చేస్తూ హష్మీకి ఓ పంచ్ విసిరింది. ఈ మధ్య ఫేమస్‌లీ ఫిల్మ్‌ఫేర్ అనే షోలో పాల్గొన్న ఐష్‌ను.. మీ మీద వచ్చిన చెత్త కామెంట్ ఏది అని అడిగారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. ఫేక్ అండ్ ప్లాస్టిక్ అని చెప్పింది. నిజానికి ఐష్‌ను ఈ మాటలన్నది ఇమ్రాన్ హష్మీ. నాలుగేళ్ల కిందట కాఫీ విత్ కరణ్ అనే షోలో పాల్గొన్న ఇమ్రాన్.. ఐశ్వర్య లుక్‌పై కామెంట్ చేశాడు. ఐశ్వర్య ఓ ప్లాస్టిక్ అని అతడు అన్నాడు. ఇది అప్పుడే చాలా మందిని షాక్‌కు గురి చేసింది. దీంతో వెంటనే ఇమ్రాన్ సారీ కూడా చెప్పాడు. ఏదో సరదాగా చేసిన కామెంటేనని అతనన్నాడు. అయితే ఐష్ మాత్రం అతని కామెంట్స్‌ను లైట్ తీసుకోలేదు. ఇన్నేళ్ల తర్వాత కూడా వాటిని మరచిపోకుండా తనపై వచ్చిన అత్యంత చెత్త కామెంట్ అదేనని చెప్పడం విశేషం. నిజానికి 2017లో బాద్‌షాహో మూవీలో నటించాల్సిందిగా ఐశ్వర్యను మూవీ మేకర్స్ కోరారు. అయితే అందులో ఇమ్రాన్ హష్మీ కూడా ఉన్నాడని తెలియడంతో వెంటనే ఆమె నో చెప్పింది.