స్వల్ప అస్వస్థతకు గురైన షాలిని పాండే

స్వల్ప అస్వస్థతకు గురైన షాలిని పాండే

నెల్లూరు: అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండే బుధవారంన ఉదయం స్వల్ప అస్వస్థతకు గురైంది. ఓ మొబైల్ షోరూమ్ ఓపెనింగ్ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరుకి వెళ్లింది. ట్రంకురోడ్డు, ఏసీ సెంటర్ లో ప్రోగ్రామ్. బుధవారం ఉదయం నెల్లూరు చేరుకున్న షాలిని.. షెడ్యూల్ ప్రకారం ఉదయం 10 గంటలకు షాపు ఓపెనింగ్ లోకి పాల్గొన్నది. ఆ తర్వాత లైవ్ మ్యూజిక్ పేరుతో చిన్న కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో హీరోయిన్ షాలినీ అకస్మాత్తుగా కళ్లు తిరిగి పడిపోయింది. షాపు యాజమాన్యం వెంటనే బొల్లినేని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో స్ట్రైచర్ పై తీసుకెళ్లే సమయంలో శరీరంపై తెల్లటి వస్త్రం కప్పి ఉంచారు. ముఖం కనిపించకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. రెండు గంటల చికిత్స, అబ్జర్వేషన్ తర్వాత డిశ్చార్జ్ చేశారు డాక్టర్లు.

దీనిపై షాలిని పాండే స్పందించింది. తనకేం కాలేదని అప్పటికే జ్వరంతో బాధపడుతున్నట్లు ఫేస్ బుక్ లోఓ వీడియో పోస్ట్ చేసింది.. అయితే ఆమె తీవ్ర అస్వస్వతకు గురయ్యారంటూ పుకార్లు రావడంతో షాలిని అభిమానులు తీవ్ర ఆందోళన చెందారు. చాలామంది తనకు ఫోన్లు చేసి పరామర్శిచడంతో ఆమె ఫేస్‌బుక్ లైవ్‌లోకి వచ్చి తనకు ఏం కాలేదని, బాగానే ఉన్నానని క్లారిటీ ఇచ్చింది. కొద్దిగా తలనొప్పి, జ్వరం ఉంటే ఆసుపత్రికి వెళ్లానని, అంతే తప్ప కొన్ని మీడియాల్లో వస్తున్నట్టు తీవ్ర అస్వస్థత కాదని తెలిపింది.