మగాడిగా మారిన సన్నీ లియోన్ ..!

మగాడిగా మారిన సన్నీ లియోన్ ..!

  బాలీవుడ్ హాట్ బాంబ్ సన్నీ లియోన్ మగాడి గెటప్ లో దర్శనమిచ్చి అందరికి షాక్ ఇచ్చింది. తేరే ఇంతెజార్ అనే సినిమాలోని ఓ పాట కోసం సన్నీ ఇలా మేల్ గెటప్ వేసుకుంది. గెటప్ మాత్రమే కాదు తన బాడీ లాంగ్వేజ్ కూడా పురుషుడిలా ఉండేలా జాగ్తత్త పడిందట. మేల్ గెటప్ లోకి మారిన తనకి తన బ్రదర్, డాడ్ ని చూసినట్టు ఉందట. ఇటీవల పురుషుడి గెటప్ వేసుకొని దిగిన ఫోటోలని తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది సన్నీ లియోన్.

ఇవి ప్రస్తుతం వైరల్ గా మారడమే కాదు, అందరు ఆశ్చర్యానికి గురయ్యేలా చేస్తున్నాయి. అసలు గుర్తు పట్టలేనంతగా ఉన్న సన్నీ ఫోటోలు సోషల్ మీడియాని మాత్రం ఓ ఊపు ఊపేస్తున్నాయి. తేరే ఇంతెజార్ చిత్రం రాజీవ్ వాలియా దర్శకత్వంలో తెరకెక్కగా ఈ మూవీని నవంబర్ 24న విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. గౌరీ ఖాన్, సుధా చంద్రన్, ఆర్య బబ్బర్ లు తేరే ఇంతెజార్ లో ముఖ్య పాత్రలు పోషించారు సన్నీ లియోన్ ఇటీవల గరుడ వేగ అనే తెలుగు చిత్రంలోను ఓ స్పెషల్ సాంగ్ తో అలరించిన సంగతి తెలిసిందే.