మ్యాగజైన్ కవర్ పేజి కోసం నగ్నంగా ఫోజులు

మ్యాగజైన్ కవర్ పేజి కోసం నగ్నంగా ఫోజులు

 హైదరాబాద్: టెన్నిస్ కోర్టులోనే కాదు... మోడలింగ్‌లో కూడా మాజీ వరల్డ్ నెంబర్ వన్ కారోలిన్ వోజ్నియాకీ, 23 సార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్‌గా నిలిచిన సెరెనా విలియమ్స్ సత్తా చాటుతూనే ఉన్నారు. తాజాగా వానిటీ ఫెయిర్ మ్యాగజైన్ కవర్ పేజి కోసం నగ్నంగా ఫోజులిచ్చారు. వానిటీ ఫెయిర్ మ్యాగజైన్ తన ఈఎస్పీఎన్ వార్షిక బాడీ ఇష్యూలో భాగంగా వీరిద్దరి నగ్న ఫోటోలను తన కవర్ పేజీపై ప్రచురించింది. దీనికి సంబంధించిన ఫోటోలను మంగళవారం వీరిద్దరూ తమ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాల్లో అభిమానులతో పంచుకున్నారు.

ఈ మ్యాగజైన్ ఆగస్టులో మార్కెట్లోకి రానుంది. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం సెరెనా విలియమ్స్ గర్భవతిగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక, ఈ ఏడాది ఏప్రిల్‌లో తాను 20 వారాల గర్భవతినని సెరెనా విలియమ్స్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. సెరెనా విలియమ్స్ ప్రస్తుతం రెడిట్‌ కో ఫౌండర్ అలెక్సిస్‌ ఒహానియన్‌తో సహజీవనం చేస్తోన్న సంగతి తెలిసిందే. గత డిసెంబర్‌లో వీరిద్దరూ నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. జ‌న‌వ‌రిలో ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ గెలిచిన త‌ర్వాత సెరీనా మ‌ళ్లీ టెన్నిస్ టోర్నీలు ఆడ‌లేదు. దీంతో ప్రెగ్నెన్సీ పొట్టతో సెరెనా అదే లుక్‌తో ఈ ఫోటోకు ఫోజు ఇచ్చారు.