మ‌జిలీకి సిద్ధ‌మైన చైతూ- సామ్ జంట‌..!

మ‌జిలీకి సిద్ధ‌మైన చైతూ- సామ్ జంట‌..!

 టాలీవుడ్ మోస్ట్ క్రేజియెస్ట్ క‌పుల్ స‌మంత‌, నాగ చైత‌న్య పెళ్ళి త‌ర్వాత తొలిసారి ఓ ప్రాజెక్ట్‌లో న‌టించ‌బోతున్నారన్న విష‌యం తెలిసిందే. గ‌త ఏడాది వివాహం చేసుకున్న ఈ జంట వ‌ర్క్‌తో పాటు ప‌ర్స‌న‌ల్ లైఫ్‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. రీసెంట్‌గా స్సెయిన్ టూర్‌కి వెళ్ళిన ఈ జంట శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ప్రాజెక్ట్ కోసం సిద్ద‌మ‌య్యారు. వ‌చ్చే వారం నుండి ఈ చిత్ర షూటింగ్‌లో వీరిద్ధ‌రు పాల్గొన‌నున్నారు అని తెలుస్తుండ‌గా, చిత్రంలో సామ్-చైలు భార్య భ‌ర్త‌లుగా క‌నిపించ‌నున్నార‌ట‌. గతంలో ‘ఏమాయచేసావే, ఆటో నగర్ సూర్య, మనం’ చిత్రాలు కలిసి చేసిన చైతు, సమంత పెళ్లి తర్వాత కలిసి నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం.


నిన్ను కోరి లాంటి హిట్ మూవీ తెర‌కెక్కించిన శివ నిర్వాణ ప్ర‌స్తుతం త‌ను చేస్తున్న ప్రాజెక్ట్‌కి మ‌జిలీ అనే టైటిల్‌ని ఫిక్స్ చేయాల‌ని భావిస్తున్నాడ‌ట‌. భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని తెలిపేలా ఈ చిత్రం ఉండ‌డంతో చిత్రానికి ఆ పేరు అయితేనే బాగుంటుంద‌ని టీం భావిస్తుంట‌. ఎంతో అన్యోన్యంగా ఉండ‌నున్న‌ వారి మ‌ధ్య‌లోకి ఓ యువ‌తి రావ‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య గ్యాప్ ఏర్ప‌డుతుంద‌ట‌. కాని ఇరువురి మ‌న‌సుల‌లో ఉన్న అమిత‌మైన ప్రేమ కార‌ణంగా ఇద్ద‌రు తిరిగి క‌లుస్తార‌నేది సినిమా క‌థ అని స‌మాచారం. భార్యాభర్తల మధ్య ప్రేమ విలువను తెలిపే కథతో ద‌ర్శ‌కుడు ఈ సినిమాని తెర‌కెక్కించ‌నుండ‌గా, ఈ మూవీ అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తుంద‌ని అంటున్నారు. హ‌రీష్ పెద్ది, సాహు గ‌ర‌పాటి సంయుక్తంగా షైన్ స్క్రీన్ ప‌తాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హిందీ నటి దివ్యంశ కౌశిక్ కీలక పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమాపై అభిమానుల‌లో చాలా ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. ఇందులో నాగచైతన్య క్రికెటర్‌ పాత్రను పోషించనున్నారని టాక్‌.