నాగాలాండ్‌ ముఖ్యమంత్రిగా నెఫ్యూరాయ్‌ ప్రమాణ స్వీకారం

నాగాలాండ్‌ ముఖ్యమంత్రిగా నెఫ్యూరాయ్‌ ప్రమాణ స్వీకారం

  కొహిమా : నాగాలాండ్‌లో నేషనల్‌ డెమొక్రటిక్‌ ప్రొగ్రెసివ్‌ పార్టీ (ఎన్‌డిపిపి) నేత నెఫ్యూరాయ్‌ గురువారం నాగాలాండ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ పిబి. ఆచార్యా అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్య‌క్ర‌మంలో  నెఫ్యూరాయ్‌తో పాటు తొమ్మిది మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. . బిజెపి అధ్యక్షుడు వై. పాట్టన్‌ ఉప ముఖ్యమంత్రిగా భాద్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్‌, బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా, కిరణ్‌ రిజిజు తో పాటు, మేఘాలయ, అస్సాం, మణిపూర్‌, అరుణా చల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.