నేనో బచ్చాగాడిని- విజ‌య్‌ దేవరకొండ

నేనో బచ్చాగాడిని- విజ‌య్‌ దేవరకొండ

   ''వాట్సాప్‌ రౌడీస్‌.. నేను చెన్నైలో ఉన్నా. 'నోటా' చివరి షెడ్యూల్‌ జరుగుతోంది. ఫిల్మ్‌ఫేర్‌లో ఉత్తమ నటుడి జాబితాలో నామినేట్‌ అయ్యానట. చిరు సర్‌, వెంకీ సర్‌.. బాలయ్య బాబు వీళ్లంతా గొప్ప నటులు. చాలా కష్టపడి పనిచేస్తారు. చిన్నప్పటి నుంచి వారి సినిమాలు చూస్తూ పెరిగాను. ఇక వారి తర్వాత తారక్‌ భారు, ప్రభాస్‌ అన్న వాళ్ల జనరేషన్‌ ఉంది. వాళ్ల తర్వాతే నేను. ఒక రకంగా చూస్తే నేనో బచ్చాగాడిని'' అని అర్జున్‌ రెడ్డి అన్నారు. ఆయన కథానాయకుడిగా ద్విభాషా చిత్రం 'నోటా' తెరకెక్కుతోంది. ఆనంద్‌ శంకర్‌ దర్శకుడు. ప్రస్తుతం చెన్నైలో షూటింగ్‌ జరుగుతోంది. విజరు ఫిలింఫేర్‌లో ఉత్తమ నటుడి కేటగిరీలో నామినేట్‌ అయ్యారు. ఈ సందర్భంగా ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. 

తారక్‌, ప్రభాస్‌ వంటి పెద్ద వాళ్లతో కలిసి ఉత్తమ నటుడి కేటగిరీలో ఫిలింఫేర్‌కు నామినేట్‌ కావడం గొప్ప విజయంగా అభివర్ణిస్తూ తనకైతే అవార్డు గెలిచినట్లే ఉందని పేర్కొన్నారు. 'సాధారణంగా పెళ్లిళ్లలో పెద్దలందరూ ఒక చోటు కూర్చొని మాట్లాడుకుంటూ పిల్లలను ఆడుకోమంటారు. ఒక చిన్న పిల్లాడినైన నన్ను పెద్దలందరూ పిలిచినట్లు ఉంది' అని వ్యాఖ్యానించారు. తనకు పట్టలేనంత సంతోషంగా ఉందని, ఫిలింఫేర్‌ అవార్డుల కార్యక్రమానికి వెళ్తున్నానని, తనతో పాటు ఒకర్ని తీసుకువెళ్తానని చెప్పారు. అభిమానుల గురించి తన చాలా ప్రణాళికలు ఉన్నాయని, రాబోయే రెండు మూడు నెలల్లో అవన్నీ ప్రకటిస్తానని వెల్లడించారు. తనెవరైతే బాగా ఇష్టపడతారో.. వాళ్లు http://www.rowdyclub.in వెబ్‌సైట్‌కు వెళ్లి, అక్కడ పేరు, వివరాలను ఇవ్వాలని, వారిలో ఒకర్ని తనతో ఫిలింఫేర్‌కు తీసుకెళ్తానని ఆ వీడియోలో పేర్కొన్నారు.