పెళ్లయిన తర్వాత ....షరతులు వర్తిస్తాయి!

పెళ్లయిన తర్వాత ....షరతులు వర్తిస్తాయి!

  ఎంతటి మగవారైనా పెళ్లయిన తర్వాత భార్యా విధేయులుగా మారాల్సిందే. ఇల్లాలి షరతుల్ని ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే. ఇందుకు సెలబ్రిటీలు కూడా మినహాయింపు కాదు. ఇటీవలే వివాహబంధంతో ఒక్కటైన బాలీవుడ్ జంట రణవీర్‌సింగ్, దీపికాపదుకునే విషయంలో కూడా ఇదే విషయం రుజువవుతున్నదని అంటున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సతీమణి దీపికా పదుకునే గురించి రణవీర్‌సింగ్ చెప్పిన విషయాలు బాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారాయి. పెళ్లయిన తర్వాత దీపిక తనకు ఎన్నో షరతులు విధిస్తున్నదని, గతంలో మాదిరిగా జీవితాన్ని ఎంజాయ్ చేసే వెసులుబాటు లేకుండా పోయిందని రణవీర్ సరదాగా వ్యాఖ్యానించారు. ఏ అర్ధరాత్రో ఇంటికి వస్తానంటే కుదరదు. పదింటిలోపే ఠంచనుగా ఇల్లు చేరాలి. రాత్రి భోజనం ఇంట్లోనే చేయాలి. ఎల్లప్పుడు ఫోన్‌లో అందుబాటులో ఉండాలి.. ఇవీ దీపిక పెట్టిన షరతులని రణవీర్‌సింగ్ తెలిపారు. ఈ షరతులు కొంచెం ఇబ్బంది పెట్టినా వైవాహిక జీవితం సాఫీగా సాగడానికి అవసరమని రణవీర్ పేర్కొన్నారు.