పెళ్లి వేదిక ఖరారు?

పెళ్లి వేదిక ఖరారు?

  రణవీర్‌సింగ్, దీపికాపదుకునే ప్రేమాయణం గురించి అందరికి తెలిసిందే. రామ్‌లీల చిత్ర షూటింగ్ సమయంలో మొగ్గతొడిగిన వీరి ప్రేమబంధం నిరాటంకంగా కొనసాగుతున్నది. ఈ జంట ఈ ఏడాదే పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఇందుకు సంబంధించి ఇరు కుటుంబసభ్యులు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. తాజాగా వీరిద్దరి పెళ్లి వేదికపై ఓ ఆసక్తికరమైన వార్త బయటికొచ్చింది. ఇటలీలోని ప్రఖ్యాత లేక్ కోమో రిసార్ట్‌లో ఈ జంట వివాహ వేడుకకు నిర్వహించబోతున్నట్లు తెలిసింది. అక్టోబర్‌లో పెళ్లి తేదిని ఫిక్స్ చేశారని చెబుతున్నారు. ప్రస్తుతం షారూక్‌ఖాన్ నటిస్తున్న జీరో చిత్రంలో దీపిక అతిథి పాత్రలో నటిస్తున్నది.