‘పిల్ల‌ల‌ని పోర్న్ వైపు వెళ్ళ‌నివ్వ‌ను’

‘పిల్ల‌ల‌ని పోర్న్ వైపు వెళ్ళ‌నివ్వ‌ను’

  ఒక‌ప్పుడు పోర్న్ స్టార్‌గా ఉన్న స‌న్నీ లియాన్ ఆ త‌ర్వాత బాలీవుడ్ ఐటెం గార్ల్‌గా మారింది. ప్ర‌స్తుతం కొన్ని ప్ర‌ధాన పాత్ర‌లు చేస్తుంది. సౌత్‌లో స‌న్నీ ప్ర‌ధాన పాత్ర‌లో ఓ మూవీ తెర‌కెక్కుతుందంటే ఆమెకి ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అయితే గతేడాది మహారాష్ట్రలోని లాతూర్ నుంచి ఓ పాపను దత్తత తీసుకున్న సన్నీ, వెబర్ దంపతులకి ఈ మ‌ధ్య స‌రోగ‌సి ద్వారా ఇద్ద‌రు క‌వ‌ల మ‌గ పిల్ల‌లు జ‌న్మించారు. ఆషెర్ సింగ్ వెబర్, నోహ్ సింగ్ వెబర్, నిషా కౌర్ వెబర్‌లతో మా కుటుంబం పరిపూర్ణమైంది అని సన్నీ తెలిపింది. అయితే త‌న పిల్ల‌ల భవిష్య‌త్ గురించి రీసెంట్‌గా స్పందించింది స‌న్నీ.


కెరీర్ విష‌యంలో నా త‌ల్లిదండ్రులు ఎలాంటి అభ్యంత‌రాలు చెప్ప‌క‌పోవ‌డంతో పోర్న్ నే కెరియ‌ర్‌గా ఎంచుకున్నాను. పోర్న్ రంగంలోకి రావ‌డం వ‌ల‌న నాకు ఎలాంటి అసంతృప్తి లేక‌పోయిన‌ప్ప‌టికి ప‌లువురు న‌న్ను అస‌హ్యించుకోవ‌డం, బూతులు తిట్ట‌డం ఇబ్బంది పెట్టాయి . నా పిల్ల‌ల‌ని పోర్న్‌గ్ర‌ఫీ వైపు అస్స‌లు వెళ్ల‌నీయ‌ను. కెరీర్ విష‌యంలో స్వ‌తంత్రంగా వదిలేస్తానంటూ చెప్పుకొచ్చింది హాట్ బ్యూటీ స‌న్నీ లియోన్‌ . జీ టీవి గ్రూప్ కరెంజిత్ టు సన్నీ అనే పేరుతో స‌న్నీ బ‌యోపిక్ రూపొందిస్తుంది.

పోర్న్ కి ముందు ఆ తర్వాత సన్నీ జీవిత విశేషాలని ఈ బయోపిక్ లో చూపించనున్నారట. ఇదిలా ఉంటే స‌న్నీ రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో వీర‌మాదేవి అనే ఫుల్ ప్లెడ్జ్‌డ్ మూవీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మూవీ సౌత్ ఇండియన్ కల్చర్స్ బ్యాక్ డ్రాప్ తో చారిత్రాత్మక యుద్ధ నేపథ్యంలో తెర‌కెక్కుతుంది. తెలుగు, తమిళ, మలయాళం,హిందీ భాషల్లో రూపొందుతున్న‌ ఈ చిత్రాన్ని వి.సి.వడివుడయన్ తెరకెక్కిస్తుండ‌గా, స్టీవ్స్ కార్నర్ పతాకంపై పోన్స్ స్టిఫెన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.