ర్యాంపుపై ఎరుపు ముత్యం

ర్యాంపుపై ఎరుపు ముత్యం

  ర్యాంప్‌పై హొయలు పోతూ బాలీవుడ్‌ నటి ఐశ్వర్యరారు నడుస్తూ ఉంటే...అందరి కళ్లూ ఆమెపైనే. ధగధగా మెరిసిపోయే ముత్యాలతో డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రా తయారు చేసిన ఎర్ర గౌను ధరించి ర్యాంప్‌పై అదరగొట్టేసింది. ఈమె మాత్రమే కాదు ఐశ్వర్య ముద్దులు కూతురు ఆరాధ్య కూడా ఆమెలాంటి వస్త్రాలే ధరించి తల్లితో సమానంగా ర్యాంప్‌ వాక్‌ చేసింది. అందుకే ఆ ఫ్యాషన్‌ షోకే ఐశ్వర్యరారు టాపర్‌గా నిలిచింది. ఖతర్‌లోని దోహలో ఫ్యాషన్‌ వీకెండ్‌ ఇంటర్నేషన్‌ 2018 పేరిట షో నిర్వహించారు. ఈ వేడుకలో మనీష్‌ మల్హోత్ర కూడా పాల్గొన్నారు. ఐశ్వర్య రారు ఇటీవల 'ఫన్నే ఖాన్‌' చిత్రంలో నటించింది. ఆ చిత్రంలో ఆమె నటనకు విశేషమైన ప్రశంసలు లభించాయి.