‘రష్మికను ప్రశాంతంగా ఉండనివ్వండి’

‘రష్మికను ప్రశాంతంగా ఉండనివ్వండి’

   'గీత గోవిందం' కథానాయిక రష్మిక మండన్నా నిశ్చితార్థం గురించి సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అటు హీరోయిన్‌ తల్లి, ఇటు హీరో రక్షిత్‌ శెట్టి స్పందించారు. తన కుమార్తె నిశ్చితార్థం రద్దయినట్లు రష్మిక తల్లి సుమన్‌ మీడియా ద్వారా వెల్లడించారు. రక్షిత్‌ ఫేస్‌బుక్‌ ద్వారా బుధవారం స్పష్టతనిచ్చారు. 'రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఎంతగానో ప్రేమించిన వ్యక్తి నుంచి నన్ను దూరం చేస్తున్నాయి. మీరంతా రష్మిక గురించి ఏవేవో అభిప్రాయాలు అనుకున్నారు. ఈ విషయంలో మిమ్మల్ని వేలెత్తి చూపలేను. ఎందుకంటే అది అలా జరిగిపోయింది. మనం కళ్లతో చూసిన విషయాలనే నమ్ముతాం. ఒక్కోసారి మనం చూసేవి కూడా నిజం కాకపోవచ్చు. 

మరోవైపు నుంచి ఆలోచించకుండా ఓ నిర్ణయానికి వచ్చేస్తుంటాం. నాకు రష్మిక రెండేళ్లుగా తెలుసు. ఆమె గురించి మీకంటే నాకే బాగా తెలుసు. రష్మికను టార్గెట్‌ చేయకండి. ప్రశాంతంగా ఉండనివ్వండి. త్వరలో అన్ని నిజాలు బయటికి వచ్చి అంతా సద్దుమణుగుతుందని ఆశిస్తున్నా. మీడియాలో వచ్చే వార్తలు నమ్మొద్దు. అవసరాల కోసం ఎవరికివారు వార్తలు సృష్టిస్తున్నారు. ఊహాగానాలు నిజాలు కావు. నేను సోషల్‌మీడియాకు దూరంగా ఉండటానికి, రష్మికకు ఎలాంటి సంబంధం లేదు. సామాజిక మాధ్యమాలకు అలవాటు పడిపోతున్నాను. అలా కాకుండా ఇక నుంచి కేవలం పని మీదే ఫోకస్‌ చేయాలనుకుంటున్నాను' అని పేర్కొన్నారు.