రీ ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ భామ‌

 రీ ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ భామ‌

  బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్ బిపాసా బసు , హెట్ స్టొరీ 3 ఫేం కరణ్ గ్రోవర్ సింగ్‌ని ఏప్రిల్ 30, 2016న వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. పెద్దల సమక్షంలో ఎంతో గ్రాండ్ గా జరిగిన వీరి వివాహ వేడుకకి ప్రముఖ బాలీవుడ్ సినీ సెలబ్రిటీస్ హాజరయ్యారు. పెళ్లి తర్వాత సినిమాలకి కాస్త దూరంగానే ఉంటున్న బిపాసా ఫ్రీ టైంలో విదేశాలకి వెళుతుంది. అక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ టూర్ కి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా పేజ్ ద్వారా అందిస్తూ వస్తుంది . ఇటీవల తను ప్రగ్నెంట్ అనే వార్తలు బీటౌన్లో షికారు చేశాయి. వీటిని కొట్టి పారేసింది బిపాసా. అయితే 2002లో వ‌చ్చిన రాజ్ అనే చిత్రంతో బాలీవుడ్ డెబ్యూ ఇచ్చింది బిపాసా. 


రాజ్ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సునామి సృష్టించ‌డ‌మే కాకుండా, ఈ హాట్ భామ‌కి మంచి పేరు తెచ్చి పెట్టింది. ఆ త‌ర్వాత బిపాసా.. రేస్‌, నో ఎంట్రీ వంటి హిట్ చిత్రాల‌లో న‌టించింది. పెళ్ళి త‌ర్వాత సినిమాల‌కి గ్యాప్ ఇచ్చిన బిపాసా ఈ ఏడాది రీఎంట్రీ ఇస్తుంది. సింగ‌ర్ మికా సింగ్ నిర్మాణంలో రూపొందుతున్న చిత్రంలో న‌టిస్తున్న బిపాసా ఈ మూవీ కోసం లండ‌న్‌కి చెక్కేసింది. ఈ ప్రాజెక్ట్ పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డి కానున్నాయి. బిపాసా గ‌త నెల 30న త‌న భ‌ర్త‌తో క‌లిసి గోవాలో సెకండ్ యానివ‌ర్స‌రీ సెల‌బ్రేష‌న్స్ జ‌రుపుకుంది. ఆ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. 2015లో వచ్చిన ఎలోన్ అనే చిత్ర షూటింగ్ లో క‌ర‌ణ్‌, బిపాసాల‌ మధ్య ప్రేమ చిగురించిన సంగతి తెలిసిందే .