రెస్టారెంట్ లో వంటకాలకి శ్రీదేవి సినిమా పేర్లు

రెస్టారెంట్ లో వంటకాలకి శ్రీదేవి సినిమా పేర్లు

  కొందరు సినీతారలకు ఎప్పటికీ క్రేజ్ తగ్గదు. వయస్సు పెరుగుతున్న కొద్ది వారిపై అభిమానం ఇంతకు పదింతలు పెరుగుతుంది. ఇందుకు ఉదాహరణ నిన్నటి తరం హీరోయిన్ శ్రీదేవి అని చెప్పవచ్చు. 50 ఏళ్లు దాటినా శ్రీదేవి చాలామందికి అతిలోక సుందరే . ఆమెని అభిమానించే అభిమానులు ఇప్పటికి చాలా మందే ఉన్నారు. కేవలం మనదేశంలోనే కాదు విదేశాలలోను శ్రీదేవిపై ఒక్కొక్కరు ఒక్కోరకంగా తమ అభిమానం చాటుకుంటున్నారు.


చెన్నైలో అనీశ్ నాయర్ అనే వ్యక్తి శ్రీదేవిపై ఉన్న అభిమానంతో ఆమె పేరిట ఓ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేయాలని అనుకున్న సంగతి తెలిసిందే. ఇనిస్టిట్యూట్ లో నటన, నాట్యంకి సంబంధించి శిక్షణ ఇస్తారట. పేదపిల్లలకి అయితే ఉచితంగా శిక్షణ ఇస్తామని అనీశ్ అన్నాడు. తన పేరుతో ఓ ఇనిస్టిట్యూట్ ప్రారంభిస్తున్నారనే విషయం తెలుసుకున్న శ్రీదేవి చాలా హ్యపీగా ఫీలైనట్టు తెలుస్తుంది. ముంబై, హైదరాబాద్, ఢిల్లీ, కోల్ కతాతో పాటు పలు దేశాల్లోనూ ఈ ఇనిస్టిట్యూట్ కి సంబంధించిన బ్రాంచ్ లు ప్రారంభించాలని అని నిర్ణయించుకున్నట్టు సమాచారం.

ఇక సింగపూర్ లోని ఓ రెస్టారెంట్ యజమానికి శ్రీదేవి అంటే అమితమైన ప్రేమ. అందుకే అందమైన ఆమె బొమ్మను తయారు చేయించి రెస్టారెంట్ లో పెట్టుకున్నాడు. సంవత్సరం పొడుగునా ఈ బొమ్మ కస్టమర్స్ ని అలరిస్తూనే ఉంటుంది. తాజాగా ఇందులో తయారుచేసే దాదాపు వంద రకాల వంటకాలకు శ్రీదేవి నటించిన సినిమాల పేర్లు పెట్టాలని నిర్ణయించుకున్నాడట. ఈ రెస్టారెంట్ ని ప్రారంభించాల్సిందిగా శ్రీదేవికి చెప్పమని ఆమె మేనేజర్ ని కోరాడట. మరి ఇందుకు శ్రీదేవి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది