స‌ల్మాన్ జైలుకెళ్ళ‌టం సంతోషాన్నిస్తుంది: న‌టి

స‌ల్మాన్ జైలుకెళ్ళ‌టం సంతోషాన్నిస్తుంది: న‌టి

  కృష్ణ జింక‌ల‌ని వేటాడిన కేసులో జోధ్‌పూర్ కోర్టు స‌ల్మాన్ ఖాన్‌కి ఐదేళ్ళ జైలు శిక్ష విధించిన సంగ‌తి తెలిసిందే. స‌ల్మాన్ త‌ర‌పు లాయ‌ర్స్ బెయిల్ పిటీష‌న్ వేయ‌గా ఈ రోజు తీర్పు రానుంది. స‌ల్మాన్ జైల్లో ఉండ‌డంతో బాలీవుడ్‌, టాలీవుడ్‌కి చెందిన ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ఆయ‌న‌పై సానుభూతి వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రి కొంద‌రు ఆయ‌న‌ని క‌లిసేందుకు జైలుకి వెళ్లొస్తున్నారు. రీసెంట్‌గా ప్రీతి జింతా జైలుకి వెళ్ళి స‌ల్మాన్‌ని క‌లిసొచ్చిన‌ట్టు స‌మాచారం. అయితే ఒక‌వైపు అంద‌రు సెల‌బ్రిటీలు స‌ల్మాన్‌కి త‌మ సానుభూతి తెలియ‌జేస్తుంటే బాలీవుడ్ న‌టి సోఫియా హ‌య‌త్ మాత్రం స‌ల్మాన్ జైలుకి వెళ్ల‌టం సంతోషాన్ని ఇస్తుంద‌ని త‌న ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలిపింది.


ఇంగ్లీష్ టీవీ షోస్‌తో పాపుల‌ర్ అయిన సోఫియా హ‌య‌త్ ప‌లు బాలీవుడ్ చిత్రాల‌లో న‌టించింది. బిగ్ బాస్ 7 కంటెస్ట్ కూడా. ప‌లు కార‌ణాల వ‌ల‌న బాలీవుడ్‌కి బై చెప్పిన సోఫియా .. స‌ల్మాన్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. చాలా మంది స‌ల్మాన్ ఖాన్‌కి వ్య‌తిరేఖంగా మాట్లాడేందుకు భ‌య‌ప‌డ‌తారు. వారంద‌రు స‌ల్మాన్ క‌నుసైగ‌ల‌లో బాలీవుడ్ న‌డుస్తుంద‌ని భావిస్తుంటారు. ఆయ‌న‌కి వ్య‌తిరేఖంగా మాట్లాడేందుకు నాకు ఎలాంటి భ‌యం లేదు. స‌ల్మాన్ జైలు కెళ్ళడం చాలా సంతోషంగా ఉంది. ఈ మాన‌వాళికి జంతువుల అవ‌స‌రం ఎంతో ఉంది. ఆయ‌న జంతువుల‌ని వేటాడి స‌మాజానికి ఏం మెసేజ్ ఇద్దామ‌ని. సెల‌బ్రిటీ అయితే అత‌ను 'లా' ని బ్రేక్ చేయోచ్చా , చ‌ట్టం ముందు అంద‌రు స‌మాన‌మే. స‌ల్మాన్ జైలుకి వెళ్ల‌డం అత‌ను చేసుకున్న క‌ర్మ‌. చేసిన పాపానికి అత‌ను శిక్ష అనుభ‌విస్తున్నాడు. కాస్త ఆల‌స్య‌మైన ..భార‌త చ‌ట్టాలు న్యాయం చేకూరిస్తాయ‌ని పోస్ట్ పెట్టింది. ఇక నో మోర్ హ్యూమన్ అంటూ స‌ల్మాన్ పోస్ట‌ర్ ఒక‌టి షేర్ చేసింది.