సరికొత్త లుక్ లో ప్రియాంక...

సరికొత్త లుక్ లో ప్రియాంక...

  బాలీవుడ్ తారలలో ప్రియాంక రూటే సపరేటు. ఛామన ఛాయతోనే మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం హాలీవుడ్ లోను తన హవా చూపిస్తుంది. బేవాచ్ సినిమాతో హాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక క్వాంటికో టీవీ సిరిస్ చేస్తుంది. ప్రస్తుతం ప్రియాంక చేతిలో రెండు హాలీవుడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.అయితే ప్రస్తుతం క్వాంటికో ఆంగ్ల టీవీ షో ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటుంది ప్రియాంక, ఇందులో భాగంగా న్యూయార్క్ లోని ఓ మీడియా హౌజ్‌ కి వచ్చిన ప్రియాంక ఆల్ట్రామోడ్రన్ స్టైల్లో అదరగొట్టేసింది. ఫార్మల్ లుక్ కి కాస్త ట్విస్ట్ ఇచ్చి యూత్ మతులు పోగొడుతుంది ప్రియాంక. పర్పుల్ కలర్ డ్రెస్ వేసుకుని... వైట్ కలర్ హ్యాండ్ బ్యాగుతో యమా స్టైలిష్ గా నడుచుకుంటూ వస్తున్న ప్రియాంకని చూసి గ్లామర్ ప్రియులు తెగ మురిసిపోతున్నారు. రానున్న రోజులలో ప్రియాంక క్రేజ్ వరల్డ్ వైడ్ గా పెరిగిపోవడం ఖాయమని అంటున్నారు ఫ్యాషన్ ప్రపంచ నిపుణులు. త్వరలో భారత్ అనే చిత్రంతో ప్రియాంక బాలీవుడ్ కి రీఎంట్రీ ఇవ్వనుంది. ఇందులో సల్మాన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.