>

సోషల్ మీడియాలో ప్రియాంకనే టాప్ 

సోషల్ మీడియాలో ప్రియాంకనే టాప్ 

 లాస్‌ఏంజెల్స్: బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా బేవాచ్ మూవీతో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. బేవాచ్, క్వాంటికో సిరీస్‌తో ఇంటర్నేషనల్ స్టార్‌డమ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మోస్ట్ పాపులర్ నటిగా నిలిచింది. ప్రియాంక తన కోస్టార్ డ్వానే జాన్సన్, వండర్ వుమెన్ స్టార్ గాల్ గాఢట్‌ను వెనక్కి నెట్టేసి మొదటి ప్లేస్‌లో నిలవడం విశేషం. 


సోషల్ మీడియా ఎనలిటిక్స్ కంపెనీ ఎంవీ పిండిక్స్ తాజాగా ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్, గూగుల్స్ ప్లస్ వంటి సోషల్ మీడియా ఖాతాల్లో మోస్ట్ పాపులర్ ర్యాంకింగ్ యాక్టర్ల లిస్ట్‌ను విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో మొదటి ప్లేస్‌లో ప్రియాంక, డ్వానే జాన్సన్ సెకండ్ ప్లేస్, యాక్టర్, కమెడియన్ కెవిన్ హర్ట్ మూడో ప్లేస్‌లో నిలిచారు. వండర్ వుమెన్ స్టార్ గాల్ గాఢట్ నాలుగో ప్లేస్, కారా డెలివింగ్నే ఐదో ప్లేస్‌లో నిలిచారు. తర్వాత స్థానాల్లో విన్ డీజిల్, జెన్నిఫర్ లోపేజ్, అస్లే బెన్సన్, జాక్ ఎఫ్రాన్ ఉన్నారు.


Loading...