త్రిష సముద్రంలోకి దూకేసింది!

త్రిష సముద్రంలోకి దూకేసింది!

 అవును.. త్రిష దూకింది. ఎందుకు? అంత కష్టం ఏమొచ్చింది? కష్టాలేం లేవ్‌. సరదా కోసమే దూకారు. అవునా? అవును... నిజమే! సరదాగా సముద్రంలోకి దూకి, నీటి అడుగుకు వెళ్లి, జలచరాల మధ్య వాటితో పాటు ఈత కొట్టడమే ‘స్కూబా డైవింగ్‌’. ఇదంటే త్రిషకు ఎంతో ఇష్టమట. ఎక్కువగా వేసవిలో స్కూబా డైవింగ్‌ చేయడానికి జనాలు ఇష్టపడతారు. మొన్న వేసవిలో శ్రిచ మాల్దీవ్స్‌లో స్కూబా డైవింగ్‌ ఎంజాయ్‌ చేశారు. ఇప్పుడు త్రిషకు తీరిక దొరికినట్టుంది. ‘టైమ్‌ ఫర్‌ సమ్‌ అండర్‌వాటర్‌ లవ్‌ రే’ అని త్రిష స్కూబా డైవింగ్‌కి వెళ్లే ముందు ఫొటోని ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.