>

ట్విట్టర్‌లో అత్యధిక ఫాలోవర్లు ఉన్నది ఈమెకే..!

ట్విట్టర్‌లో అత్యధిక ఫాలోవర్లు ఉన్నది ఈమెకే..!

  లాస్ ఏంజలస్: పాప్ స్టార్ కేటీ పెర్రీ.. కేవలం తన మ్యూజిక్‌తోనే కాదు, ట్విట్టర్‌లో ఫాలోవర్లను పెంచుకోవడంలోనూ అగ్ర స్థానంలో దూసుకుపోతుంది. ప్రసుతం ఈమెకు ట్విట్టర్‌లో 100 మిలియన్ల ఫాలోవర్లు (10 కోట్లు) ఉన్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ట్విట్టర్ ఫాలోవర్లు ఉన్న వ్యక్తిగానే కాదు 10 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్న తొలి ట్విట్టర్ యూజర్‌గా కేటీ పెర్రీ రికార్డు సృష్టించింది. అభిమానులు ఆదరించడం వల్లే తాను ఈ ఘనత సాధించానని ఈ సందర్భంగా కేటీ పెర్రీ తెలిపింది. ఇక అత్యధిక ట్విట్టర్ ఫాలోవర్లు ఉన్న వారిలో 97 మిలియన్లతో పాప్ సింగర్ జస్టిన్ బీబర్ రెండో స్థానంలో నిలిచాడు. ఆ తరువాత 90 మిలియన్ల ఫాలోవర్లతో మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా 3వ స్థానంలో నిలిచారు.


Loading...