వరుణ్ ధవన్ పెళ్లికి ముహూర్తం ఫిక్సయిందా..?

వరుణ్ ధవన్ పెళ్లికి ముహూర్తం ఫిక్సయిందా..?

 గతేడాది బాలీవుడ్ సెలబ్రిటీలు రణ్ వీర్ సింగ్, దీపికాపదుకొనే, ప్రియాంక చోప్రా ఓ ఇంటి వారైన విషయం తెలిసిందే. ప్రియాంక, నిక్ జొనాస్ తోపాటు రణ్ వీర్, దీపికాపదుకొనే వివాహబంధంతో ఒక్కటయ్యారు. వీరి తర్వాత పెండ్లిపీటలెక్కనున్న జాబితాలో బాలీవుడ్ యువ నటుడు వరుణ్ ధవన్ చేరిపోయాడు. వరుణ్ ధవన్, తన చిన్ననాటి స్నేహితురాలు నటాషా దలాల్ తో ప్రేమలో ఉన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సంవత్సరమే ఈ జంట ఓ ఇంటివారు కానున్నట్లు బాలీవుడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. వరుణ్, నటాషా దలాల్ పెళ్లి వేడుక డిసెంబర్ లో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే పెళ్లి వార్తలపై వరుణ్ ధవన్ నుంచి కానీ..అతడి తండ్రి డేవిడ్ ధవన్ నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.