వేడుకగా దీపికా రణవీర్‌ ల  రిసెప్షన్‌

వేడుకగా దీపికా రణవీర్‌ ల  రిసెప్షన్‌

 దీపికా పదుకొనే, రణవీర్‌సింగ్‌ గత నెలలో 14, 15 తేదీల్లో ఇటలీలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం రెండు సార్లు వివాహ రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు. అందులో మొదటిది బెంగళూరులోనూ, రెండోది ముంబాయిలోని వ్యాపారవేత్తల కోసం ఏర్పాటు చేశారు. తాజాగా సినిమా ఇండిస్టీ ప్రముఖుల కోసం ముంబాయిలో రిసెప్షన్‌ నిర్వహించారు. భారీ సంఖ్యలో ఇండిస్టీ ప్రముఖులంతా హాజరై 'దీప్‌వీర్‌'లను ఆశీర్వదించారు. ఈ చివరి రిసెప్షన్‌ను ముంబయిలోని గ్రాండ్‌ హైయత్‌లో ఏర్పాటు చేశారు. బాలీవుడ్‌ బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. వీరితో పాటు షారుఖ్‌ ఖాన్‌, కరీనా కపూర్‌, సైఫ్‌ అలీ ఖాన్‌, సోనా అలీ ఖాన్‌, కత్రినా కైఫ్‌, అనుష్క శర్మ, జాక్విల్‌ ఫెర్నాండేజ్‌, రేఖ, హేమాలిని, అతిథి రావు హైదరి, జాన్వీ కపూర్‌, రోహిత్‌ శెట్టి, ఫార్హా ఖాన్‌, కరణ్‌ జోహార్‌, డైరెక్టర్స్‌ కబీర్‌ ఖాన్‌, సంజరు లీలా భన్సాలీ, పారిశ్రామిక వేత్తలు అంబాని, నీతా అంబాని, ముఖేష్‌ అంబాని వారి కుటుంబం, క్రికెటర్‌ దిగ్గడం సచిన్‌ టెండూల్కర్‌, ఎంఎస్‌ ధోని కుటుంబాలు, హార్దిక్‌ పాండ్య తదితరులు హాజరయ్యారు.