‘వీర్ ప్రపోజ్ చేయ‌క‌పోయి ఉంటే...’

‘వీర్ ప్రపోజ్ చేయ‌క‌పోయి ఉంటే...’

  అందంగా, కాస్త బొద్దుగా ఉన్న నమిత న‌వంబ‌ర్ 24న తను కోరుకున్న ప్రియుడిని వేద మంత్రాల సాక్షిగా వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. తిరుప‌తి ఇస్కాన్ టెంపుల్‌లో జ‌రిగిన వీరి వివాహానికి కోలీవుడ్‌కి చెందిన ప‌లువురు సినీ సెల‌బ్రిటీలు హాజ‌రయ్యారు. పెళ్లి త‌ర్వాత మీడియాతో మాట్లాడిన వీర్‌.. న‌మిత సినిమాల‌కి దూరం కాద‌ని అన్నాడు. ఇక న‌మిత తాజాగా ఓ ఆంగ్ల ప‌త్రిక‌కి ఇంట‌ర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో వీర్‌పై ప్ర‌శంస‌లు కురిపించింది. త‌ను ప్ర‌పోజ్ చేసినప్పుడు రిజెక్ట్ చేసేందుకు ఏ కార‌ణం దొర‌కలేద‌ని, ఒక‌వేళ వీర్ ప్ర‌పోజ్ చేయ‌క‌పోయి ఉంటే నేనే అత‌న‌ని ప్ర‌పోజ్ చేసి ఉండేదానిని అని చెప్పుకొచ్చింది న‌మిత‌. గ‌తంలో త‌నకు మూడు ఫెయిల్యూర్స్ ఉన్నాయని అన్న న‌మిత‌, జీవితంలో స‌రైన వ్య‌క్తిని ఎంచుకోవ‌డం ఎంత ముఖ్య‌మో ఫెయిల్యూర్స్ వ‌లన తెలిసింద‌ని పేర్కొంది. ఇక పెళ్లి త‌ర్వాత త‌న జీవితంలో ఎలాంటి మార్పు రాలేద‌ని చెప్పుకొచ్చిన బొద్దుగుమ్మ‌, మెడలో మంగళసూత్రం, కాలికి మెట్టెలు మాత్రమే పెళ్లి త‌ర్వాత‌ వచ్చాయని చెప్పింది.