భూగర్భ జలం క్షీణిస్తోంది 

భూగర్భ జలం క్షీణిస్తోంది 

లండన్‌, అహ్మదాబాద్‌: భారత్‌లో భూగర్భ జలాలు క్షీణిస్తుండటానికి హిందూ మహాసముద్రం వేడెక్కుతుండటానికి మధ్య పరస్పర సంబంధం ఉన్నట్లు తాజా అధ్యయనం గుర్తించింది. మనదేశంలో సాగునీటి అవసరాలకు భూగర్భ జలాలే ప్రధాన వనరు. ఇటీవల ఈ జలాలు హెచ్చుస్థాయిలో తగ్గుముఖం పడుతుండటంపై పలు దేశాల శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనానికి గాంధీనగర్‌ ఐఐటీ పరిశోధకులు నేతృత్వం వహించారు. తక్కువస్థాయి వర్షపాతాల కారణంగా హిందూ మహాసముద్రం వేడెక్కుతోందని వారు విశ్లేషించారు. వర్షపాత లేమి భూగర్భ జలాల క్షీణతకూ దారితీస్తుందన్నారు. హిందూ మహాసముద్రం వేడెక్కడం, భూగర్భ జలాల తగ్గుదలకు మధ్య ఈ పరస్పర సంబంధాన్ని తాము తొలిసారిగా గుర్తించామన్నారు. భూగర్భ జలాల పెంపునకు కృషి చేయాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు.