>

కోల్ కతాలో 23వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్

కోల్ కతాలో 23వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్

కోల్ కతా: 23వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ను పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ పారంభించారు.శుక్రవారం(నవంబర్-10)నాడు కోల్ కతాలో భారత దేశంలో రెండవ అతి పెద్ద ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైంది.

8రోజుల పాటు జరగనున్న ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో 53 దేశాలకు చెందిన 143 సినిమాలు ప్రధర్శించనున్నారు. కోల్ కతాలోని 12 ప్రాంతాల్లో ఈ సినిమాలు ప్రదర్శించనున్నారు.ఈ కార్యక్రమంలో సినీ స్టార్ అమితాబ్ బచ్చన్, జయాబచ్చన్,కమల్ హాసన్, షారుఖ్ ఖాన్, కాజల్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య బచ్చన్  పాల్గొన్నారు.