ప్రియాంక, నిక్‌ వివాహం

ప్రియాంక, నిక్‌ వివాహం

  బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా, అమెరికా గాయకుడు, గీత రచయిత నిక్‌ జొనాస్‌ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఉమైదా భవన్‌ ప్యాలెస్‌లో వీరి పెళ్లి కనుల పండుగగా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు మాత్రం బయటకు రాలేదు. వివాహం జరిగే సమయంలో ప్యాలెస్‌లో ఎనిమిది రౌండ్లు బాణాసంచా పేల్చారు. క్రిస్టియన్‌ పద్ధతిలో జరిగిన వివాహానికి ముఖేష్‌ అంబాని కుటుంబం మొత్తం హాజరైంది. గణేష్‌ హెగ్డే, సందీప్‌ ఖోస్ల, మిక్కీ కాంట్రాక్టర్‌, అర్పితా ఖాన్‌, బ్రిటిష్‌ ఇండియన్‌ టీవీ స్టార్‌ జాస్మిన్‌ వల్లియో, హాలీవుడ్‌ నటి ఎలిజిబిత్‌ ఛాంబర్స్‌ తదితరులు హాజరై దంపతులను దీవించారు. దీనికి ముందు శుక్రవారం రాత్రి వీరి పెళ్లి సంగీత్‌ను ఘనంగా నిర్వహించారు. ఇందులో ప్రియాంక, నిక్‌ కలిసి ఉత్సాహంగా డ్యాన్స్‌ చేశారు. దాదాపు నాలుగు గంటలపాటు సంగీత్‌ జరిగింది. ప్రియాంక కోసం నిక్‌ ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారు. దాన్ని చూసి ప్రియాంక భావోద్వేగానికి గురైందట. సంగీత్‌ వేడుకకు ప్రియాంక సోదరి, నటి పరిణీతి చోప్రా పంజాబీ, రాజస్థానీ పాటలకు డ్యాన్స్‌ చేశారట. అంతేకాదు విదేశాల నుంచి వచ్చిన ఆర్టిస్టులు కూడా ఈ కార్యక్రమంలో సందడి చేసినట్లు సమాచారం.