‘118’...యాక్షన్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌

‘118’...యాక్షన్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌

   కల్యాణ్‌ రామ్‌ హీరోగా రూపొందుతోన్న 16వ చిత్రం శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ చిత్రం సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. దీనికి '118' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు చిత్రబృందం సోమవారం ప్రకటించింది. ఈ సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో నివేదా థామస్‌, షాలిని పాండే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కె.వి.గుహన్‌ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై మహేశ్‌ కొనేరు నిర్మిస్తున్నారు. 

నిర్మాత మహేశ్‌ కోనేరు మాట్లాడుతూ 'నందమూరి కల్యాణ్‌ రామ్‌ ఇప్పటి వరకు చేయనటువంటి జోనర్‌ మూవీ ఇది. సరికొత్త క్యారెక్టర్‌లో మెప్పించనున్నారు. ఇదొక స్టైలిష్‌ యాక్షన్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌. కథ, కథనంతో పాటు యాక్షన్‌ పార్ట్‌కు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. వెంకట్‌, అన్బరివు, రియల్‌ సతీష్‌ అద్భుతమైన యాక్షన్‌ పార్ట్‌ను అందించారు. బ్యూటీఫుల్‌ విజువల్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసిన ప్రముఖ ఛాయాగ్రాహకులు కె.వి.గుహన్‌ ఈ చిత్రంతో డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. దర్శకత్వంతో పాటు ఆయన కథ, కథనం, సినిమాటోగ్రఫీ చేశారు. శేఖర్‌ చంద్ర సంగీత సారథ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను వచ్చే ఏడాది జనవరి ద్వితీయార్థంలో విడుదల చేయాలనుకుంటున్నాం' అని అన్నారు.